11న రాయుడు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని ‘రాయుడు’ పేరుతో హరి వేంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవలే గ్లామర్ హీరోయిన్స్ శ్రుతిహాసన్, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్ విడుదల చేశారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి విశాల్ మాట్లాడుతూ, పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో విభిన్నమైన సినిమాగా నిలుస్తుందని, ముత్తయ్య అద్భుతంగా తెరకెక్కించాడని, ఆలాగే నా గెటప్ కూడా కొత్తగా వుంటుందని అన్నారు. అన్నిరకాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఇందులో వుంటాయని అన్నారు. నిర్మాత హరి మాట్లాడుతూ, ముగ్గురు టాప్ హీరోయిన్లు ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదలచేయడం ఆనందంగా వుందని, ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.