ట్రైలర్స్‌లో కేడీ..కిలాడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమల్, శివకార్తికేయన్, రెజీనా, బిందుమాధవి హీరో హీరోయిన్లుగా పాండీరాజ్ దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అందిస్తున్న చిత్రం ‘కేడీ బిల్లా కిలాడీ రంగా’. ఈ చిత్రంలోని ట్రైలర్స్ హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. నిర్మాత మల్కాపురం శివకుమార్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించాలని అన్నారు. రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో సూపర్‌హిట్ అయిందని, అలాగే తెలుగులో మంచి విజయం సాధించి రామసత్యనారాయణకు లాభాలు తేవాలని అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, పాండిరాజ్ చిత్రాలకు తమిళంలో మంచి క్రేజ్ వుందని, ‘పసంగ’, ‘కథకళి’, ‘మేము’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. ఆయన రూపొందించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి హిట్‌గా నిలిచిందని, విమల్, శివకార్తికేయన్‌ల నటన, రెజీనా, బిందుమాధవిల గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. త్వరలోనే పాటలను విడుదలచేసి ఈనెల 13న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.