ఎగిరి గంతేసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటిలో కీర్తిసురేష్ కష్టం ఊరికేపోలేదు. ఆహార్యం, అభినయంలో సావిత్రిని గుర్తు చేసిన కీర్తి కోసం -సౌత్ సినిమాలు వరుస కడుతున్నాయి. ఆమె చేతిలో వివిధ భాషా చిత్రాలు కనీసం అరడజను వరకూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మహానటి ఇమేజ్ నీడలో వచ్చిన చిత్రాలే కనుక -ఎక్కువ శాతం మహిళా ప్రాధాన్యతా చిత్రాలే కావడం విశేషం. ఆ ఇమేజ్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ ట్రాక్‌లోకి వచ్చేందుకూ కీర్తికి అదృష్టమే కలిసొచ్చిందని చెప్పాలి. తాజా ప్రాజెక్టును ఆమె సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇచ్చింది. అది -తలైవా రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకోవడం. తెలుగులో ‘మిస్ ఇండియా’తోపాటు నితిన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న రంగ్ దే చిత్రంలోనూ కీర్తి సురేష్ లీడ్‌రోల్స్ చేస్తోంది. ఉమెన్ సెంట్రిక్ రోల్స్ నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తున్న కీర్తికి -రజనీ సినిమా గొప్ప టర్న్ అనుకోవాలి. రజనీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్‌లో దర్బార్ చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొస్తోంది. తరువాత మాస్ చిత్రాల దర్శకుడు శివతో 168వ ప్రాజెక్టు చేయనున్నట్టు రజనీ ఇప్పటికే ప్రకటించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకునే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు కోసం కీర్తిని ఎంపిక చేసుకున్నారు. విషయం కన్ఫర్మేషన్ రాగానే ఇన్‌స్టాలో ఎగిరి గంతేసి ఫ్యాన్స్‌కు షేర్ చేసిన కీర్తి -‘నేను రజనీకి పెద్ద ఫ్యాన్. ఇప్పుడు ఆయన కనిపిస్తా. అలాంటి చాన్సిచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది. కలిసొచ్చే కాలముంటే కెరీర్ ఇలానే దూకుడుగా పరుగులు తీస్తుంది.