క్యారెక్టర్ ఎక్కేశాడట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి సినిమాగా వస్తోన్న అల.. వైకుంఠపురములో చిత్రంపై ఆడియన్స్ ఫోకస్ కాస్త ఎక్కువగా ఉంది. కాంబినేషన్, హ్యాట్రిక్ టార్గెట్, హీరోయిన్.. టబు రీఎంట్రీ.. ఇలా ఎన్నో కారణాలు. ముఖ్యంగా -సంక్రాంతికి వస్తున్న పెద్ద చిత్రాల వద్ద బన్నీ తన స్టామినా చూపించే చిత్రం కూడా కావడం. అలాంటి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నుంచి త్రివిక్రమ్ టీం తాజాగా టీజర్‌ను వదిలింది. సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆదినుంచీ బన్నీ ఒకడుగు ముందే ఉన్నట్టే.. ఈసారి క్లాస్ మాస్ లుక్ టీజర్‌తో మరో అడుగేశాడు. క్లాస్ లుక్‌తో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్న బన్నీ, లవ్, కామెడీ, యాక్షన్స్ సీన్స్‌లో తనదైన స్టయిల్ చూపించాడన్న విషయం టీజర్‌తో అర్థమవుతోంది. పూజా హెగ్దె ఆఫీస్‌లో బన్నీ పని చేస్తున్నాడన్న క్లారిటీ టీజర్‌తో రావడంతో -ఈ పాయింట్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘నువ్వు ఇప్పుడే కారు దిగావ్. నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా -అనే డైలాగ్ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో ముఖ్య పాత్రలో టబు కనిపించనుండటంతో -ప్రాజెక్టుకు అదే పెద్ద ప్లస్ అన్న నమ్మకంతో చిత్రబృందం కనిపిస్తోంది. విడుదల టైంకి అల.. వైకుంఠపురములో నుంచి ఇంకెన్ని హైలెట్స్ బయటకు రానున్నాయో చూడాలి. టీజర్ విడుదలైన 7 నిమిషాలకే 1 మిలియన్ వ్యూస్ దాటినట్టు చిత్రబృందం ప్రకటించుకుంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నాయి.