భలే దొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడియన్స్‌తో ‘ఖైదీ’ అటాచ్‌మెంట్ తక్కువేం కాదు. అందుకే ఎమోషనల్ కంటెంట్‌ను బ్లాక్‌బస్టర్ చేసేశారు. ఆ సక్సెస్ అందుకున్న హీరో -కార్తి. తాజాగా వయాకామ్ 18 స్టూడియోస్, ప్యార్లల్ మైండ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ డైరెక్షన్‌లో చేసిన సినిమా -దొంగ. డిసెంబర్ 20న థియేటర్లకు వస్తున్న చిత్రాన్ని తెలుగులో హర్షిత మూవీస్ అధినేత రావూరి వి శ్రీనివాస్ అందిస్తున్నారు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఆ ఉత్సాహంతోనే చిత్రబృందం ట్రైలర్‌ను బయటకు వదిలింది. చిన్నా ఇంకా నా కళ్లలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే -అంటూ జ్యోతిక ఎమోషనల్‌గా డైలాగ్‌తో ట్రైలర్ మొదలవ్వడం ఆసక్తి రేకెత్తించింది. ఎలా ఉందిరా పెర్‌ఫార్మెన్స్? అన్న వీవో ప్రశ్నకు -న్యాయంగా రాజవౌళి సినిమాలో నన్నుపెట్టాలి. ఎవరెవర్నో పెడుతున్నారు’ అంటూ తనదైన కామెడీ టైమింగ్‌తో కార్తీ చెప్పే డైలాగ్ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు కథకి తగిన యాక్షన్‌ను జీతూ జోసెఫ్ దట్టించాడన్న విషయం ట్రైలర్‌తో అర్థమవుతుంది. ట్రైలర్ చివర్లో -ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా... ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్కా.. అంటూ కార్తీ చెప్పే ఎమోషనల్ డైలాగ్ బావుంది. హర్షిత మూవీస్ అధినేత రావూరి వి శ్రీనివాస్ మాట్లాడుతూ -టీజర్, పాటలు, ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ‘దొంగ’పై నమ్మకంతో ఉన్నామన్నారు. సత్యరాజ్, నికిలావిమల్ ముఖ్యపాత్రలు పోషిస్తోన్న చిత్రానికి ఆర్‌డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, గోవింద వసంత సంగీతం సమకూరుసుతన్నారు.