గుప్పెడంత పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరోనక్, అతిథి సింగ్ జంటగా వినోద్ లింగాల దర్శకత్వంలో ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో సందీప్‌కిషన్ ఆడియో సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ట్రైలర్స్, పాటలు బాగున్నాయని, యూత్‌కి కనెక్ట్ అయ్యే పాయింట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. వంశీ మాట్లాడుతూ, వినోద్ మంచి పాషన్ వున్న దర్శకుడని, పాటలన్నీ వినసొంపుగా వున్నాయని, విజువల్స్ అద్భుతంగా వున్నాయని అన్నారు. దర్శకుడు మధుర శ్రీ్ధర్ మాట్లాడుతూ, వినోద్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని అన్నారు. దర్శకుడు వినోద్ మాట్లాడుతూ, ఔట్ అండ్ ఔట్ లవ్‌స్టోరీ ఇదని, మొదటి ప్రేమలో ఫీలింగ్స్ ఎలా వుంటాయి? ప్రేమ కాలాన్ని, దూరాన్ని జయిస్తుందనే కానె్సప్టుతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సాగే సినిమా ఇదని అన్నారు. ఈ సినిమాకు సంగీతం ప్రాణం. నవనీత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పావని లింగాల, ఆర్ట్:రాజీవ్ నాయర్, ఎడిటింగ్:బసవ పైడిరెడ్డి, కెమెరా:సంజయ్ లోకనాధ్, సంగీతం:నవనీత్ సుందర్, నిర్మాణం:ఐవింక్ ప్రొడక్షన్స్, దర్శకత్వం:వినోద్ లింగాల.