నలుగురు హీరోయిన్లతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యామిని, భావన, రుహిణి, వర్ష హీరోయిన్లుగా శ్రీ సాయి గణపతి క్రియేషన్స్ పతాకంపై ‘అంజన’రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కొండా విజయ్‌కుమార్ క్లాప్ కొట్టగా, దర్శకులు సుకుమార్ సోదరుడు విజయ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత వై.కోటిబాబు, నిర్మాత శివ (అపురూప్), ఆర్టిస్ట్ భద్రం, జబర్దస్త్ అప్పారావులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కె.యం.రాధాకృష్ణ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అంజన రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ఇదొక డిఫరెంట్ జోనర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నలుగురు హీరోయిన్లకు జోడీగా ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో నటించనున్నారు. కె.యం.రాధాకృష్ణ అందించే సంగీతం ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మే ద్వితీయార్థం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.’ అన్నారు.