కృష్ణమనోహర్ ఐపీఎస్‌గా ప్రభుదేవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబుతో దర్శకుడు పూరి తెరకెక్కించిన పోకిరి ఓ బ్లాక్‌బస్టర్. ఆ సినిమాను బాలీవుడ్ బాద్షా సల్మాన్‌ఖాన్‌తో వాంటెడ్‌గా తెరకెక్కించి హిట్టందుకున్నాడు ప్రభుదేవా. ఇప్పుడు ప్రభుదేవా హీరోగా తమిళంలో తెరెకెక్కిన పోకిరి చిత్రం తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’గా ఆడియన్స్ ముందుకొస్తోంది. పవన్‌పుత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో నిర్మాత సీతారామరాజు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్‌లో థియేటర్లకు రానుంది. సినిమాలో ప్రభుదేవాతో నివేదా పేతురాజు రొమాన్స్ చేయనుంది. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళం, తెలుగు.. రెండు భాషల్లో ఒకేసారి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేసినట్టు నిర్మాత సీతారామరాజు వెల్లడించారు. కృష్ణమనోహర్‌గా ఇప్పటికే మహేష్‌బాబు మెప్పించిన నేపథ్యంలో.. అంతకుమించి ప్రభుదేవా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడో వెండితెరపై చూడాలి.