ఇదిగో.. జెన్నీఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూ.యన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా దర్శక దిగ్గజం రాజవౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం -ట్రిపుల్ ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కథలకు కాల్పానికత జోడించి రాజవౌళి సంధించనున్న సోషియో ఫాంటసీ ఇది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. సీతారామరాజు పాత్ర పోషిస్తోన్న రామ్‌చరణ్ సరసన ఆలియా భట్‌ను ఇప్పటికే రాజవౌళి టీం ఎంపిక చేసుకుంది. కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్న యన్టీఆర్‌కు జోడీ ఎవరన్నది చాలాకాలంగా సస్పెన్స్ నడిచింది. ముందుగా ఎంపిక చేసుకున్న బ్రిటీష్ యాక్ట్రెస్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో, యన్టీఆర్‌కు జోడీని ఎంపిక చేయడం చిత్రబృందానికి తలనొప్పిగానే మారింది. పాత్రపరంగా బ్రిటీష్ నటే కావాల్సి రావడంతో -హాలీవుడ్ నుంచి మరో నటిని తెచ్చేందుకు రాజవౌళి టీం చేసిన ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. ఇటీవలి కాలంలో హాలీవుడ్ ట్రిప్ వేసిన రాజవౌళి, యన్టీఆర్‌కు జోడీని అక్కడే ఫైనల్ చేశాడంటూ కొద్దిరోజులుగా వార్తలు రావడం తెలిసిందే. తాజాగా బుధవారం సస్పెన్స్‌కు తెరదించుతూ -యన్టీఆర్‌కు జోడీగా జెన్నిఫర్ పాత్ర కోసం ఓలివియా మోరిస్‌ను ఎంపిక చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ట్రిపుల్ ఆర్‌లో లేడీ విలన్ పాత్ర కోసం హాలీవుడ్ సీనియర్ నటి ఆలిసన్ డూడీని ఎంపిక చేశారు. ఐర్లాండ్‌కి చెందిన ఈ నటి ఇండియానా జోన్స్ (1989), టాఫిన్, మేజర్‌లీగ్ 2 చిత్రాలతో గ్రేట్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవడం తెలిసిందే. 2017లో వచ్చిన డేవిడ్‌సన్ చిత్రంలోనూ ఆమె కనిపించారు. మరో బ్రిటీష్ రూలర్ పాత్ర కోసం ఐరిష్ యాక్టర్ రేమండ్ స్టీవెన్సన్‌నూ ఎంపిక చేసుకున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కొద్దికాలంగా ట్రిపుల్ ఆర్ నుంచి అప్‌డేట్స్ ఏమీ లేకపోవడంతో -సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం లేదంటూ కథనాలు గుప్పుమన్నాయి. కీలెంచి వాత పెట్టగల దర్శకుడు రాజవౌళి -రూమర్స్‌కు చెక్‌పెట్టేందుకు బిగ్ అనౌన్స్‌మెంట్‌కు తెరలేపాడు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, అనుకున్న సమయానికి సినిమాను థియేటర్లకు తెచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని ఈ అనౌన్స్‌మెంట్‌తో చిత్రబృందం చెప్పకనే చెప్పింది. ఆలస్యంతో విషాన్ని కూడా అమృతం చేసుకుని దిగ్గజ దర్శకుడు రాజవౌళి, ఆర్టిస్టుల అనౌన్స్‌మెంట్‌తో ప్రాజెక్టుకి ఎంత ప్రమోషన్ సంపాదించాలో అంతా మీడియా నుంచి పిండుకున్నాడు.