టచ్‌లోనే ఉన్నానంటూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్క్రీన్‌మీద కాకున్నా.. సోషల్ మీడియాలోనైనా హీరోయిన్లు ‘గ్లామర్’ చూపిస్తేనే.. ఒకటో అరో అవకాశాలు ఒళ్లోపడతాయి. అయితే చేసిన సినిమాలు సరిగా ఆడక ఐరెన్‌లెగ్ ముద్రపడితే మాత్రం ఎన్ని అందాలు చూపించినా.. ఇంకెన్ని ఫొటోషూట్లు చేసినా ఫలితమైతే ఉండదు. ఈ పరిస్థితిని ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ ఎదుర్కొంటోంది. నిజానికి అందం, అభినయం రెండూవున్న నటిగా అనుకు మంచి పేరే వచ్చింది. అదృష్టం కలిసొచ్చి స్టార్ హీరోలతోనూ సినిమాలు పడ్డాయి. పవన్ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి చేస్తే, అల్లు అర్జున్‌తో నాపేరు సూర్య.. సినిమాలు చేసింది. కాలం కలిసిరాక రెండూ డిజాస్టర్లు కావడంతో -ఆ ప్రభావం హీరోయిన్ అనుపైనే ఎక్కువ పడింది. అనుపై ఐరెన్‌లెగ్ ముద్ర పడటంతో, చాన్స్‌ల్లేకుండా పోయాయి. అందుకే -అందుమైన ఫొటోషూట్లతో అవకాశాల కోసం ఎదురు చూస్తోందట. ఫొటోషూట్ పిక్స్‌ని తనే వైరల్ చేస్తూ -ఇండస్ట్రీకి టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తోందట. ఉరుములా వచ్చిన అనూ మలయాళీ సొగసుకు అంతా దాసులైనా.. డిజాస్టర్ చిత్రాలతో మెరుపులా మాయమైన ఆమెను దాదాపుగా అంతా మర్చిపోయారు. ప్రస్తుతం తన చేతిలో ఒకే ఒక్క తమిళ సినిమా ఉన్నట్టు ఆమే చెబుతోంది. అందం, అభినయం ఎనున్నా.. ఏం లాభం? అదృష్టమనే గీత పిసరంత లేకున్నా.. హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి తప్పదు. కాలమెప్పుడూ ఒక తీరున ఉండదు కనుక, తన రోజూ మళ్లీ రాకపోతుందా అన్న ఆశతో ఎదురు చూస్తోందట అను ఇమ్మాన్యుయేల్.