పరారి.. ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగేశ్వర్ హీరోగా వస్తున్న పరారీ ఆడియన్స్‌ని తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది అంటున్నాడు హీరో సుమన్. యోగీశ్వర్‌ను హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు సాయి శివాజీ తెరకెక్కిస్తోన్న చిత్రం -పరారి. రన్ ఫర్ రన్ అనేది ఉపశీర్షిక. శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మిస్తోన్న చిత్రంలో అతిథి హీరోయిన్ పాత్ర చేస్తోంది. తాజాగా నిర్వహించిన పరారి ఆడియో లాంచ్‌కు హీరో సుమన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -నా వందో సినిమా చేయాలని నిర్మాత గిరి ప్రయత్నించినా కుదరలేదు. తన కొడుకు యోగీశ్వర్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలని నా దగ్గరకు వచ్చినపుడు అది నా బాధ్యత అనుకున్నా. ఏ సినిమా సక్సెస్ అయినా ఆడియోతో మొదలవుతుంది. ఈ చిత్రానికి చక్రి సోదరుడు మహిత్ నారాయణ మంచి ఆల్బమ్ ఇచ్చాడు. యోగీశ్వర్ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాడు అన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ -యోగీశ్వర్ డ్యాన్స్‌బావుంది. మహిత్ సారథ్యంలో రూపుదిద్దుకున్న పాటలు ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ -చిన్న సినిమా అనడానికి వీల్లేకుండా నిర్మించిన విధానం చూస్తుంటే, నిర్మాత గిరి పర్మినెంట్ ప్రొడ్యూసర్ అవుతారనిపిస్తుంది అన్నారు. నటుడు శ్రవణ్ మాట్లాడుతూ -నిర్మాత గిరి నాకు ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు. యోగీశ్వర్ టాలెంట్ సెట్స్‌లో చూశాక.. సంతోషంగా ఉంది. నిర్మాతకు మంచి విజయం దక్కాలని ఆశిస్తున్నా అన్నారు. సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ -చక్రి నాకు అన్నయ్యే కాదు, గురువు కూడా. ఆయన పేరుని తీసుకుని ప్రయాణం మొదలెట్టాను. మంచి టీంతో కలిసి పనిచేసే అవకాశం పరారితో దక్కింది. బాణీలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో -నిర్మాత గిరి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అనిపిస్తోంది అన్నారు. దర్శకుడు సాయిశివాజీ మాట్లాడుతూ -కథ వెనుక మూడేళ్ల కష్టముంది. నా కష్టానికి తగిన టెక్నికల్ టీం దొరికింది. ఈ సినిమాతో గిరి బెస్ట్ ప్రొడ్యూసర్ కావడం ఖాయం అన్నాడు. హీరో యోగీశ్వర్ మాట్లాడుతూ -నన్ను హీరో చేసింది మా నాన్న. హీరో సుమన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. డీవోపీ అంజి, ఫైట్‌మాస్టర్ నందు సపోర్ట్ మర్చిపోలేను. ఓ మంచి ఎంటర్‌టైనర్ ఇస్తున్నాం. నన్ను హీరోని చేసేందుకు సపోర్ట్ చేసిన అందరికీ ధాంక్స్ అన్నాడు. నిర్మాత గిరి మాట్లాడుతూ -ఈ సినిమా కోసం క్వాలిటీమీద దృష్టిపెట్టాం తప్ప, బడ్జెట్ లెక్కల మీద ఫోకస్ పెట్టలేదు. నేను సుమన్ అభిమానిని. ఈ సినిమా చూశాక నా కొడుక్కీ ఫ్యాన్ అయిపోయా. చక్రిమీద అభిమానంతో మహిత్‌కు మ్యూజిక్ అవకాశం ఇచ్చాం. సినిమా విషయంలో అన్ని విధాలా సంతృప్తికరంగా ఉన్నా అన్నారు.