పాత్రే కదిలించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టూడెంట్ యూనియన్ లీడర్ క్యారెక్టర్ చేయాలని చాలాకాలంగా ఉన్నా,
జార్జిరెడ్డి పాత్రే తనకొస్తుందని అనుకోలేదంటున్నాడు సందీప్ మాధవ్. ఉస్మానియా స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి జీవితం ఆధారంగా అల్లుకున్న కథతో దర్శకుడు జీవన్‌రెడ్డి తెరకెక్కిస్తోన్న సినిమా -జార్జిరెడ్డి. సందీప్ మాధవ్, సత్యదేవ్ ముఖ్య పాత్రధారులు. నవంబర్ 22న సినిమా థియేటర్లకు వస్తోన్న నేపథ్యంలో -సందీప్ సోమవారం
మీడియాతో మాట్లాడాడు.
దర్శకుడు జీవన్‌తో చాలాకాలంగా స్నేహం. కలిసి సినిమా చేయాలన్న ఆలోచన ఇద్దరికీ ఉండేది. జార్జిరెడ్డి కథను జీవన్ ప్రతిపాదించినపుడు -పాత్ర నచ్చి నేనూ ఓకే చేశా.
వంగవీటి విడుదలైన తరువాత జరిగిన పరిణామమిది. వంగవీటి తరువాత విన్న కథలేవీ నన్ను ఎగ్జైట్ చేయలేకపోయాయి. ఆ టైంలో జీవన్ ఈ కథ చెప్పటంతో -్ఫక్సైపోయా.
నిజానికి వేరే సినిమాలు చేతిలో లేవు కనుక -రెండేళ్లుగా ఫోకస్‌లో లేను. అంతేతప్ప దర్శకుడి కండిషన్స్, మరే కారణాలుగానీ కావు. బట్, కథ కోసం రీసెర్చ్‌పరంగాను, ఫిజికల్‌గానూ బాగా వర్కౌట్స్ చేశాం. వాటిపైనే నమ్మకంతో ఉన్నాం. స్టోరీలో నేను చేసిన జార్జిరెడ్డి పాత్ర 21నుంచి 25ఏళ్ల వరకూ కనిపిస్తుంది. వయసుకు తగిన లుక్ మార్చుకునేందుకూ కసరత్తు చేశా.
జ్యోతిలక్ష్మి చిత్రంలో కామెడీ చేసినా -సీరియస్ రోల్సే వచ్చాయి. నిజానికి వంగవీటి నాకు వస్తుందనుకోలేదు. దర్శకుడు పూరితో ట్రావెలవుతుంటే, వర్మచూసి రాధగా ఫిక్స్ చేసుకున్నారు. తరువాత రంగా పాత్రనూ చేయమంటే చేశా.
జార్జిరెడ్డి పాత్రను అవగాహన చేసుకుని బాడీ లాంగ్వేజ్ ఫిక్స్ చేసుకున్నా. క్రైసిస్ ఇన్ ద క్యాంపస్ పేరిట బీబీసీ చేసిన వీడియోలో ఆయన మాడ్యులేషన్స్ ఉన్నాయి. రెండు మూడు ఫొటోల్లో జార్జిరెడ్డి పోజు చూసి బాడీ లాంగ్వేజ్‌ను ఊహించుకున్నా. అలా డెవలప్ చేసి పాత్ర పోషించా. దర్శకుడు జీవన్, డీవోపీ సుధాకర్ చాలా హెల్ప్ చేశారు.
జార్జిరెడ్డిని బయోపిక్ అనడంకంటే, ఇన్‌స్పిరేషన్ అనాలేమో. కాకపోతే అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తప్ప, కల్పితాలేమీ ఉండవు. 1968 నేపథ్యంలోవున్న ఒక స్టూడెంట్ లీడర్ స్టోరీ. అంతే ఉంటుంది.
జార్జిరెడ్డి క్యారెక్టరైజేషన్‌నే నన్ను ఇంప్రెస్ చేసింది. ఆయన లాస్ట్‌డేస్ స్టోరీ చదువుతున్నపుడు కన్నీళ్లొస్తాయి. ఆ ఎమోషన్ సినిమాలోనూ ఉంటుంది. ఆయన కథ అంత అర్లీగా ముగిసి ఉండకపోతే -ఇండియాకు మంచి సైంటిస్ట్ ఉండేవాడేమో అనిపిస్తుంటుంది.
అప్పటి కాలమాన పరిస్థితుల్ని చెప్పడానికి డిఫరెంట్ కలర్‌టింట్‌లో సినిమా ఉంటుంది. సైకిళ్ళు, బైక్‌లు, చివరకు అమ్మాయిలువాడే బైక్‌లు సైతం అప్పటి కాలానివి కొని సినిమాలో వాడాం. మరీ ముఖ్యంగా ఉస్మానియా సెట్ వేసి వర్క్ చేశాం. అది నిజంగా ఉస్మానియా వర్శిటీయే అన్నంత సహజంగా సెట్ ఉంటుంది.
బయోపిక్స్ వస్తున్నాయిగానీ, ప్రస్తుతానికి చేసే మూడ్‌లో లేను. ఈ సినిమా రిజల్ట్ చూసి, తరువాత ఎలాంటి కథ చేయాలో నిర్ణయించుకుంటా. రెండు సీరియస్ సినిమాలు చేశాను కనుక, చేంజోవర్ కోసం మరేదైనా జోనర్‌ని ఎంపిక చేసుకోవాలని అనిపిస్తోంది.