సైరా దర్శకుడితో సాహో హీరో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి ‘సైరా’తో దర్శకుడు సురేందర్ రెడ్డి స్టేటస్ మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాన్ని సమర్థంగా డీల్ చేసిన సురేందర్‌రెడ్డి, మరో భారీ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ -సురేందర్ రెడ్డి కాంబోపై సోషల్ మీడియాలో వినిపిస్తోన్న కథనాల్లో వాస్తవం లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రభాస్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. బాహుబలి, సాహో చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిన ప్రభాస్ రేంజ్‌కి తగిన స్టైలిష్ ఎంటర్‌టైనర్ స్టోరీని సురేందర్ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రాజెక్టును మూడు భాషల్లో తెరకెక్కించనున్నారని, గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణతో జాన్ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు.