22న బీచ్‌రోడ్ చేతన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్‌ర్యాంక్ రాజు చిత్రాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తన్న చిత్రం -బీచ్‌రోడ్‌లో చేతన్. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్‌పై రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విలన్ పాత్రధారి భాను మాట్లాడుతూ -అందరికీ ఉండే కలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తి కావాలని, ఈ చిత్రంలో చేతన్ తనకో మంచి పాత్ర ఇచ్చాడన్నారు. యూనిట్ అంతా కలిసి సినిమా చేశామన్నారు. కో డైరెక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ -హైదరాబాద్, వైజాగ్‌లలో చిత్రీకరించిన ఈ సినిమాలో దాదాపు 150మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చామన్నారు. వైవిధ్యమైన కథా కథనంతో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, సినిమాను విజయవంతం చేయాలన్నారు. హీరో, దర్శకుడు చేతన్ మాట్లాడుతూ -22న సినిమా విడుదలవుతుందని, మార్నింగ్ షో టికెట్లను తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా ఇస్తున్నామన్నారు. దాదాపు 200 థియేటర్లలో విడుదలవుతోన్న చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతూ, ప్రయోగాత్మక చిత్రంతో వస్తోన్న చిత్రబృందాన్ని ఆశీర్వదించాలని కోరారు. ప్రతి ప్రేక్షకుడికీ సినిమా కనెక్టవుతుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు.