ప్లీజ్.. నా మాటే వినవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతంరాజు తనయుడు కృష్ణ, కిరణ్ ఛత్వానీ జోడీగా లింగస్వామి వేముగంటి తెరకెక్కిస్తోన్న చిత్రం -నామాటే వినవా. శివాని ఆర్ట్స్, పీఎస్ మూవీమేకర్స్ పతాకంపై శంకర్‌గౌడ్ నిర్మిస్తోన్న చిత్రమిది. సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ వడ్లపాటి మోహన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫిల్మ్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ -నిర్మాతల తరఫున ప్రతి చిన్న సినిమాకూ తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని అంటూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు లింగస్వామి మాట్లాడుతూ -యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన నా మాటే వినవా.. సినిమా పిల్లలకు, పెద్దలకు నచ్చుతుందన్నారు. హీరో కృష్ణ యూత్‌కు కనెక్టయ్యే విధంగా నటించాడని, కృష్ణారావు సూపర్‌మార్కెట్ చిత్రంతో మంచి ఫైటర్‌గా పేరు తెచ్చుకున్నాడన్నారు. అతని నటన చిత్రంలో హైలెట్‌గా ఉంటుందన్నారు. రెండు పాటలు మలేసియాలో చిత్రీకరించామని, సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయన్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీ ఖరారు చేస్తామన్నారు. బిటెక్ స్టూడెంట్స్ నిశ్చితార్థం తరువాత ఇద్దరూ కలిసి చేసే ప్రయాణంలో మంచి స్నేహితులై పెళ్లి వరకూ ఎలా వచ్చారన్నదే సినిమా కథనమన్నారు. క్లైమాక్స్‌లో సాయికుమార్ పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ -ఈ చిత్రంలో పాటలు సరికొత్తగా ఉంటాయని, ముఖ్యంగా వరంగల్ మీద తీసిన మాస్ సాంగ్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. రెండు పాటలు అరకులో, మరో రెండు మలేసియాలో చిత్రీకరించారన్నారు. లవ్ కమ్ ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన సినిమా అందరికీ నచ్చుతుందని నిర్మాత శంకర్‌గౌడ్ అన్నారు.