లైఫ్.. అనుభవించు రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూనియర్ రవితేజ, శృతిశెట్టి, శ్రావణీ నిక్కి ప్రధాన తారాగణంలో రాజారెడ్డి మూవీమేకర్స్ పతాకంపై కొత్త దర్శకుడు సురేష్ తిరుమూరు తెరెకెక్కించిన చిత్రం -లైఫ్ అనుభవించు రాజా. రాజారెడ్డి కందాల నిర్మించిన చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ -ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదోక సమయంలో సంతోషం గడపాలనే అనుకుంటారని, అటువంటి కథతో ఈ సినిమా రూపొందించారన్నారు. జూనియర్ రవితేజ ఈ చిత్రంలో బాగా నటించారన్నారు. అలాగే హీరోయిన్లు శృతిశెట్టి, శ్రావణీ నిక్కీ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అన్నారు. హీరో జూనియర్ రవితేజ మాట్లాడుతూ -ట్రైలర్ అందరికీ నచ్చుతుందని, సినిమా తప్పక విజయవంతమవుతుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రతి మనిషి లైఫ్‌లో స్వీట్ మూమెంట్స్‌లా ఈ సినిమా చూడొచ్చని, కష్టమైన సమయంలో హిమాలయాలకు వెళ్లి షూటింగ్ చేశామన్నారు. దర్శకుడు సురేష్ తిరుమూరు మాట్లాడుతూ -ఓ కథ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగాను. చాన్స్ రాకపోవడంతో మేనబావ నిర్మాతగా మారి సినిమాను రూపొందించారన్నారు. ఆడియన్స్‌కి బోర్ కొట్టుకుండా రెండు గంటలపాటు ఎంటర్‌టైన్ చేయాలని సినిమా చేశామన్నారు. షానీ, పవన్ నాగేందర్, రత్నాకర్, అనీలా తదితరులు సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.