త్రివిక్రమ్‌తో మళ్లీ ఎన్టీఆర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ఓ రేంజ్ సినిమా తీయాలంటే -కనిపించేది కొద్దిమంది హీరోలే. అందుకే -స్టార్ హీరోలు గ్యాప్ లేకుండా ప్రాజెక్టుల షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను సెట్ చేసుకుంటున్న హీరోలు కొందరైతే.. ఒక దర్శకుడితో పని చేస్తూనే మరో దర్శకుడి కథ విని లైన్లో పెడుతున్న హీరోలు మరికొందరు. ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలంతా అదే స్టయిల్ చూపిస్తున్నారు. ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజవౌళి తెరకెక్కిసోన్న ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుతో బిజీవున్న జూ.ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టును లైన్లో పెట్టాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అరవింద సమేత.. చిత్రంతో ఎన్టీఆర్‌కు బిగ్ హిట్టునిచ్చిన త్రివిక్రమ్‌తోనే తదుపరి ప్రాజెక్టు ఉండబోతోందన్నది ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్- బన్నీ కాంబోలో అల.. వైకుంఠపురములో సినిమా తెరకెక్కుతోంది. అటు ట్రిపుల్ ఆర్ పూర్తయ్యేసరికి -ఇక్కడ అల.. చిత్రాన్నీ త్రివిక్రమ్ పూర్తి చేస్తాడు. తదుపరి ఈ హిట్ కాంబోలో మరో సినిమా తెరకెక్కే అవకాశం లేకపోలేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, అది కార్యరూపం దాల్చడానికి కొంత టైమ్ పట్టొచ్చన్న మాటా వినిపిస్తోంది. ఏదైమైనా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబో మరోసారి ఫిక్సయితే.. ఆ సినిమాపై క్రేజ్ అంతా ఇంతా ఉండదు. దీనిపై అధికారిక సమాచారం ఏమైనా బయటకు వస్తుందేమో చూడాలి.