ఆమని.. అమ్మదీవెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమని ప్రధాన పాత్రలో శివ ఏటూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -అమ్మదీవెన. ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఆమని పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమానికి హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ -ఎటువంటి దీవెన అయినా తక్కువ అవ్వొచ్చుగానీ, అమ్మదీవెన ఎక్కడా తక్కువ కాదన్నారు. ఈ చిత్రంలో అమ్మగా నటిస్తోన్న ఆమని పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుందన్నారు. నిర్మాత డిఎస్ రావు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచిస్థానం సంపాదించుకున్న ఆమని అమ్మ పాత్ర పోషించటం గొప్ప విషయమన్నారు. పోస్టర్ ఆవిష్కరించిన బొంతు శ్రీదేవి మాట్లాడుతూ తల్లి దీవెనవుంటే ఎవ్వరికైనా విజయం దక్కుతుందన్నారు. ఆమని మాట్లాడుతూ -తాను ఈ చిత్రంలో లీడ్‌రోల్ చేశానని, తల్లిగా ఎంత రెస్పాన్స్‌బుల్‌గా ఉండాలనేది సినిమాలో చర్చించారన్నారు. తాగుబోతు మొగుడితో ఐదుగురు పిల్లలను పెట్టుకుని ఓ తల్లిపడే ఇబ్బందులు సినిమాలో చూస్తారని, అమ్మ ప్రేమను నిర్మాతలు ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నారన్నారు. హీరో హీరోయిన్లు, పోసాని కృష్ణమురళి నటన హైలెట్‌గా ఉంటుందన్నారు. దర్శకుడు శివ ఏటూరి మాట్లాడుతూ నెలాఖరులోగా ఆడియో విడుదల చేసి, త్వరలోనే సినిమాను థియేటర్లకు తెస్తామన్నారు.