ఆ భాస్కర్ గొడవేంటో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవిందస్వామి, అమలాపాల్, నటి మీనా కుమార్తె బేబీ నైనిక ప్రధాన తారాగణంగా సిద్ధిఖీ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. ఈ చిత్రాన్ని కార్తికేయ మూవీస్ పతాకంపై పటాన్‌చాన్ భాషా తెలుగులో అందిస్తున్నారు. ఈనెలాఖరుకు విడుదల కానున్న చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కార్యక్రమంలో దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ -తమిళ, మలయాళ భాషల్లో మంచి పేరువున్న సిద్ధిఖీ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, రెండు భాషల్లో వేరువేరుగా తీసిన సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించిందన్నారు. తెలుగుదనంతో వస్తోన్న సినిమా ఆడియన్స్‌కి నచ్చుతుందని నిర్మాత దామోదర ప్రసాద్ అన్నారు. మరో అతిథి లగడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ -మంచి కథాబలమే సినిమాకు ప్రాణమన్నారు. నిర్మాత చాన్‌భాషా మాట్లాడుతూ -తోడులేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు? వారు కలిసేందుకు పిల్లలు చేసిన ప్రయత్నాలేం చేశారు? అన్న విషయాన్ని ఆద్యంతం హాస్యప్రదానంగా చిత్రం తెరకెక్కించామన్నారు. సినిమాలో ఊహించని ఓ ట్విస్ట్ ప్రేక్షకులను అలరిస్తుందంటూ, సంగీతం హైలెట్‌గా ఉంటుందన్నారు. నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.