విశాల్ రేంజ్ పెంచేదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ చిత్రం విశాల్ రేంజ్‌ని పెంచుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు నిర్మాత ఆడెపు శ్రీనివాస్. హీరో విశాల్, తమన్నా జోడీగా దర్శకుడు సి సుందర్ తెరకెక్కించిన హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ -యాక్షన్. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత శ్రీనివాస్. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

* పద్దెనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. అయితే, దర్శకుడు కావాలన్న కాంక్షతో ఇండస్ట్రీకి వచ్చా. ఐదారు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన తరువాత డిస్ట్రిబ్యూటర్‌గా మారా. ఇప్పుడు యాక్షన్ చిత్రంతో నిర్మాతగా మీముందుకొస్తున్నా.
* యాక్షన్ టీజర్ చూసినపుడు బాగా నచ్చింది. వెంటనే తెలుగులో విడుదల చేయడానికి హక్కులు సొంతం చేసుకున్నా. ఇండస్ట్రీలో నా ప్రొఫైల్‌ని చూసి వాళ్లూ అంగీకరించారు.
* ఇదొక హైవోల్టేజ్ యాక్షన్ మూవీ. విశాల్ ఫ్యాన్స్‌కి ఇదొక గ్రాండియర్ ట్రీట్. ఈ సినిమా నేను తీసుకోడానికి మేకింగ్ ఓ కారణం.
* దర్శకుడు సి సుందర్ గురించి చెప్పేటంతటి పెద్దవాణ్ని కాదు. ఆయన సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే యాక్షన్ మాత్రం ఆయన గత సినిమాలకు మరింత వైవిధ్యంగా ఉంటుందని మాత్రం చెప్తున్నా. విశాల్ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా ఉండాలని ఈ సినిమాను తెరకెక్కించాడు సుందర్.
* హ్యూమన్ ఎమోషన్స్ క్యారీ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. అందుకే దర్శకుడిగా నాకు సంతృప్తికరమైన ఎలిమెంట్స్‌తో సినిమా తెరకెక్కిస్తా. రుద్రవీణ సినిమా చూసి నేను ఇండస్ట్రీకి వచ్చా.
* ఈ సినిమాలో రానా ఓ ర్యాప్ సాంగ్ పాడాడు. విశాల్‌లో ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. తెలుగు ఆడియన్స్‌కి ఓ స్పెషల్ ఇచ్చే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమిది.
* తమన్నా ఎంత మంచి పెర్ఫార్మరో అందరికీ తెలిసిందే. సైరాలాంటి చారిత్రక కథలోనూ ఆమె మెప్పించింది. ఇందులోనూ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ చేసింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెస్తుందనే అనుకుంటున్నా.