ఏమనుకున్నారో.. అసలేమైందో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్య బాలకృష్ణ, త్రిధాచౌదరి, సిద్ధిఇద్నాని, కోమలి ప్రసాద్ లీడ్‌రోల్స్‌లో బ్లాక్ అండ్ వైట్, పూర్వీ పిక్చర్స్ బ్యానర్లపై కొత్త దర్శకుడు బాలు అడుసుమిల్లి తెరకెక్కిస్తోన్న చిత్రం -అన్నకున్నదొకటి.. అయ్యిందొకటి. హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మాతలు. తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను నిర్మాత సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -స్నేహితులతో కలిసి సినిమా రూపొందించారని, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టేలా సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. దాదాపు పాతికేళ్లుగా వైజాగ్‌లో పూర్వీ పిక్చర్స్ పతాకంపై సినిమాలు పంపిణీ చేశామని, మా అబ్బాయి శ్రీనివాస్, అతని మిత్రుడు బాలు కలసి సినిమా రూపొందించారని వీరినాయుడు తెలిపారు. ఫస్ట్‌లుక్ ట్రెండీగా కమర్షియల్‌గా వుందని, డిసెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు పంపిణీదారు భరత్‌చౌదరి పేర్కొన్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ దశలోవుందని, మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథనంతో సినిమా ఉంటుందని దర్శకుడు బాలు తెలిపారు. నలుగురు హైదరాబాద్ అమ్మాయిలు గోవా వెళ్తే -అక్కడేం జరిగిందన్న ఆసక్తికరమైన కథనంతో సినిమా సాగుతుందన్నాడు.