లెక్క సరిపోతుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీమేక్‌ని ఓ దర్శకుడికి అప్పగించాలంటే -ఏ నిర్మాతైనా సవాలక్ష లెక్కలేసుకుంటాడు. దర్శకుడి టాలెంట్‌కు సంబంధించిన విస్తీర్ణం, వైశాల్యం, ముందువెనుకలు, ఎత్తుపల్లాలు చూసుకున్న తరువాతే.. ఆ దర్శకుడికి ప్రాజెక్టును అప్పగిస్తాడు. ఇక్కడ విషయమేంటంటే ‘స్వామి రారా’ సినిమాతో దర్శకుడిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన సుధీర్‌వర్మ -ఫస్ట్‌టైమ్ ఓ రీమేక్‌ను హ్యాండిల్ చేయబోతుండటం. సీన్ ఏదైనా దాని ఫీల్ దెబ్బతినకుండా ఫ్లేవర్డ్‌గా ప్రజెంట్ చేయటం సుధీర్‌వర్మ స్టయిల్. సినిమా జయాపజయాల మాటెలావున్నా, అతను తెరకెక్కించిన చిత్రాలన్నీ అదే కోవలో కనిపిస్తాయి. దోచెయ్, కేశవ, మొన్నటికి మొన్నొచ్చిన రణరంగం సినిమాల్లో అది చూస్తాం. నిజానికి రణరంగం సినిమా మిశ్రమ ఫలితానే్న ఇచ్చినా, సుధీర్ టేకింగ్‌కి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా సుధీర్ సినిమాను తీర్చిదిద్దగలడన్న నమ్మకంతో తొలిసారి రీమేక్ ప్రాజెక్టును అప్పగించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. బాలీవుడ్‌లో గత ఏడాది హిట్‌కొట్టిన క్రైమ్ థ్రిల్లర్ అంధాధూన్. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి హక్కులు సొంతం చేసుకున్నారు. నితిన్‌తో ఈ సినిమాను తెరకెక్కించే సమర్థుడైన దర్శకుడి కోసం వెతుకుతూ -సుధీర్‌వర్మ దగ్గర ఆగినట్టు సమాచారం. థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన మోడ్రన్ క్లాసిక్ అనిపించుకున్న సినిమాను తెరకెక్కించే బాధ్యత సుధీర్‌వర్మకు అప్పగించేందుకు దాదాపు నిర్ణయమైనట్టు తెలుస్తోంది. క్రైమ్ జోనర్ చిత్రాలను ఫ్యాషనేట్‌గా తెరకెక్కించటంలో సిద్ధహస్తుడు సుధీర్. అందుకే ఆ బాలీవుడ్ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా.. మరింత టైట్ స్క్రీన్‌ప్లే, స్టైలిష్ టేకింగ్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. నిజానికి అంధాధూన్‌లోని కొన్ని సన్నివేశాల్లో లాగింగ్ ఉంటుంది. దాన్ని ట్రిమ్మింగ్ చేసి నేటివిటీకి తగినట్టు తెరకెక్కించగల స్టామినా ఉన్నవాళ్లలో సుధీర్‌వర్మ ఫస్ట్ ప్రయార్టీలోనే ఉంటాడు. అయితే, రీమేక్‌కు సుధీర్‌వర్మ ఓకే చెబుతాడా? అన్నదే సందేహాస్పదం. ఓకే అంటే మాత్రం -అంధాధూన్ తెలుగులో మరో సెనే్సషన్ క్రియేట్ చేస్తుందని కచ్చితంగా చెప్పొచ్చు.