శ్రీరెడ్డి క్లైమాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, శివశంకర్ మాస్టార్ ప్రధాన తారాగణంగా భవాని శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం క్లైమాక్స్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో శ్రీరెడ్డి నటించడం విశేషం. కైపాస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజశేఖర్‌రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ- ఏ విషయాన్నయినా కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడుతూ ధైర్యంగా ప్రశ్నించే శ్రీరెడ్డి, ఈ చిత్రంలో తన నిజ జీవిత పాత్రను పోషించారని తెలిపారు. ఓ మర్డర్ మిస్టరీని పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో కథను అల్లుకున్నామని, కథాంశం వైవిధ్యంగా ఉంటుందని, అందుకు తగ్గట్టు చిత్రీకరణ కూడా సరికొత్తగా వుంటుందని ఆయన అన్నారు. సినిమాలో పాత్రలు సంఖ్యాపరంగా తక్కువగానే వున్నా ప్రతి పాత్ర హీరోయిజాన్ని ప్రదర్శిస్తుందని, అలా ప్రతి కారెక్టర్‌ను తీద్దామని తెలిపారు. మనసులోని భావాలను నిర్భయంగా చెబుతూ, ఎదుటివారి స్థాయికి భయపడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వివాదాస్పద నటిగా శ్రీరెడ్డి పాత్ర ఈ చిత్రంలో హైలెట్‌గా వుంటుందని, సినీ పరిశ్రమలో కన్పించే స్టీరియో టైప్ ఆలోచనలకు వ్యతిరేకంగా వుండే పాత్రలు, సన్నివేశాలు ఈ చిత్రంలో హైలెట్‌గా వుంటాయని ఆయన వివరించారు. వివాదాస్పద నటిగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందిస్తుందని, ముఖ్యంగా నా పాత్ర చుట్టే కథ తిరుగుతుందని, అందుకే ఈ చిత్రంలో తాను నటించానని నటి శ్రీరెడ్డి అన్నారు. నా ప్రతి డైలాగ్, ప్రతి సీన్ ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని, ఇంత మంచి పాత్ర ఇచ్చిందని చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను మొత్తం హైదరాబాద్‌లోనే షూటింగ్ చేశామని, త్వరలో ఆర్‌ఎఫ్‌సిలో ఓ భారీ సెట్ వేసి పాట చిత్రీకరణ జరుపుతామని, కొన్ని సినిమాలు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి అనడానికి ఉదాహరణగా ఈ చిత్రాన్ని చెప్పచ్చని నిర్మాత పి.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.