వీధి బాలలం ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాహిని క్రియేషన్స్ పతాకంపై శ్రీ తారక్ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ‘వీధి బాలలం’. మాకూ స్వతంత్రం కావాలి అనేది ఈ సినిమాకు ఉపశీర్షికగా నిర్ణయించారు. సుమారు 1200 మంది పిల్లలను అనేక పాఠశాలలనుండి ఎంపిక చేసి వారికి నటనలో మెళకువలు నేర్పించి ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలియజేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎ.శ్రీనివాసరావు చేతులమీదుగా విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్మాత ఎ.వి.వర్మరాజు మాట్లాడుతూ- ఈ సినిమా మీద వచ్చిన ప్రతి ఆదాయాన్ని అనాథ పిల్లల సహాయార్థమే ఉపయోగించడానికి తమ సంస్థ నిర్ణయించిందని, బాలల సినిమా అయినా పిన్నలకు, పెద్దలకు నచ్చుతుందని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఈ చిత్రం రూపుదిద్దుకుందని దర్శకుడు శ్రీతారక్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు తనీష్ మాట్లాడుతూ - ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపి సత్యనారాయణ, రచయిత దుర్గాప్రసాద్, విజయవాణి, ఎఫ్‌ఎం బాబాయ్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.