శ్రీ శివాయ్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమ్ వ్యాస్, దీపికా వదాని జంటగా శ్రీ శివాయ్ ఫిలింస్ పతాకంపై స్రవంతి మురళీమోహన్ తెరకెక్కిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కె.రమేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, అర్థనారి అర్జున్ విలన్‌గా నటిస్తుండడం విశేషం. పూజా కార్యక్రమాలనంతరం దర్శకుడు స్రవంతి మురళీమోహన్ మాట్లాడుతూ, హీరో హీరోయిన్లు కొత్తవాళ్లను పరిచయం చేస్తున్నామని, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో వుంటుందని తెలిపారు. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్ గోవాలో, మూడో షెడ్యూల్ కేరళలో 40 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కథలో కొత్తదనం వుండడంతో ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీగా నిర్మించి ప్రేక్షకులను అలరించేలా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామని నిర్మాత కె.రమేష్‌బాబు అన్నారు. ప్రతి సీన్ సరికొత్తగా వుండేలా స్క్రిప్ట్ తయారైందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా జి.ఎస్.రాజు, సంగీతం శివ నందిగామ అందిస్తున్నారు.