యాక్షన్.. ఓ విజువల్ ట్రీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ సినిమా ఓ విజువల్ ట్రీట్ అంటూ హీరో విశాల్ ప్రామిస్ చేశాడు. విశాల్, తమన్నా లీడ్‌రోల్స్‌లో సుందర్ సి తెరకెక్కించిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ -యాక్షన్. నవంబర్ 15న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్ బ్యానర్‌పై ‘యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్‌కి అందిస్తున్నాడు. చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో పెద్దఎత్తున నిర్వహించారు. కార్యక్రమంలో హరో విశాల్ మాట్లాడుతూ -నా యాక్షన్ కెరీర్‌లో 26 సినిమాలకు ఎన్ని దెబ్బలు తగిలాయో ఈ ఒక్క సినిమాకూ అన్ని దెబ్బలుతిన్నాను. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్ కోసం టీం మొత్తం చాలా కష్టపడ్డాం. సుందర్ సి డ్రీమ్ ప్రాజెక్టు ఇది. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన సినిమా. ఏ హీరోకైనా సౌత్‌లో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆశ ఉంటుంది. అదృష్టం కొద్దీ మూడు రాష్ట్రాల్లో నన్ను ఆదరిస్తున్నారు. ఈ సినిమా నా కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ కావడం ఖాయం అన్నాడు. లక్ష్మీకళ థియేటర్‌లో నేల క్లాస్‌లో కూర్చుని నా సినిమా చూస్తుంటానని, చాలామంది ఆడియన్స్‌కి ఆ విషయం తెలీదన్నారు. అలా చూడటం వల్ల ఏ సీన్‌కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఏ సీన్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి చాలా హోంవర్క్‌ల తరువాత చేసిన సినిమా కనుక -ఆడియన్స్‌కి కనెక్ట్ కావడం ఖాయమన్నాడు. తమన్నాతో నా రెండో సినిమా ఇది. అలాగే ఐశ్వర్య, ఆకాంక్ష ఇద్దరూ బాగా చేశారు. నా బెస్ట్ ఫ్రెండ్ రానా సినిమాలో ఓ ర్యాప్ చేయడం హ్యాపీ. ఓ మంచి సినిమా తీయలాంటే డబ్బుంటే సరిపోదు, మంచి విజన్ ఉండాలి. అలాంటి విజన్‌వున్న నిర్మాత శ్రీను. ఈ సినిమా అతనికి మంచి హిట్టునివ్వాలని, నిర్మాతగా అతను మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ -ఆర్టిస్టుగా నన్నాదరిస్తోన్న ఆడియన్స్‌కి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా సరిపోదు. నాకు తెలిసినంత వరకూ బెస్ట్ కమర్షియల్, బెస్ట్ యాక్షన్ మూవీస్ తెలుగులోనే వచ్చాయి. మాస్ చిత్రాలపట్ల మక్కువ చూపించే ఆడియన్స్‌ని ఏమాత్రం నిరాశపర్చని సినిమా యాక్షన్. విశాల్ నెక్ట్స్ లెవెల్ మాస్ మూవీ కూడా. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా అన్నారు. హీరో ఆదిత్ మాట్లాడుతూ -విశాల్ యాక్షన్ చిత్రం పవర్ ఫ్యాక్డ్ బ్లాక్‌బస్టర్ కావాలన్నారు. హీరో ప్రిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా, హీరోయిన్ ఐశర్వ లక్ష్మి, ఆకాంక్ష, నిర్మాత శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.