ఇప్పటికీ.. కుర్రాళ్లే..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిక్స్‌టీస్ దాటిన హీరోలు సరికొత్తగా పవర్ ఫ్యాక్డ్ బాడీ షేప్‌పై దృష్టి పెడుతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి.. వెటరన్ ఏజ్‌లోనూ పూర్తి ఫిట్‌నెస్‌తో కుర్ర హీరోలతో పోటీపడే ప్రయత్నం చేస్తున్నారు. మేనమామ పాత్రతో ‘వెంకీ మామ’ చేస్తోన్న వెంకటేష్.. మేనల్లుడు చైతూ ఫిట్‌నెస్‌కి సమంగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక మన్మథుడు 2 కోసం నాగార్జున చూపించిన ఫిట్‌నెస్‌ను తక్కువచేసి చెప్పలేం. షర్ట్ విప్పేసి మజిల్ పవర్ చూపించాడంటే -ఏమాత్రం కసరత్తు చేసివుంటాడో అంచనా వేసుకోవచ్చు. తాజాగా ‘రూలర్’ ప్రాజెక్టు చేస్తున్న బాలకృష్ణ... థర్టీ ఇయర్స్‌లోని మ్యాన్‌లీ అప్పియరెన్స్ చూపిస్తున్నాడు. 105వ ప్రాజెక్టుగా వస్తోన్న రూలర్‌లో బాలయ్య అల్ట్రా పోష్ లుక్ చూస్తే -కుర్రకారు సైతం షాక్ తినాల్సిందే. ఈ ఏడాది సంక్రాంతిలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ కోసం -తండ్రి ఆహార్యంలోకి తనను తను మార్చేసుకున్న బాలయ్య.. తాజాగా తొలి రోజుల్లోని హీరో అప్పియరెన్స్‌కి రావడానికి గట్టిగానే కృషి చేశాడు. భారీగా బరువుతగ్గి స్లిమ్ అయిన బాలయ్య లుక్ -కుర్ర హీరోలకూ షాక్‌నిస్తోంది. అలాంటి ప్రత్యేకతను చూపించేందుకు ఇప్పుడు చిరంజీవి సైతం నడుంకట్టాడు. చిరు 152వ ప్రాజెక్టును కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. కథానుగుణంగా హీరో కొంత సన్నబడితే మంచిదని దర్శకుడు శివ ఎప్పుడో సూచించాడు. వచ్చే జనవరి నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో చిరు తన యంగ్ గెటప్ కోసం జిమ్ మార్గానే్న అనుసరిస్తున్నాడట. జిమ్‌లో చిరు కసరత్తుల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బరువు తగ్గనున్న చిరంజీవిని కొరటాల ఎంత యంగ్‌గా చూపించనున్నాడోనన్న ఆసక్తి అప్పుడే ఇండస్ట్రీలో మొదలైంది. అధికారికంగా ప్రకటించకున్నా -చిరుతో త్రిష రెండోసారి జోడీ కట్టనుందన్న మాట వినిపిస్తోంది. ఇద్దరి మధ్య అద్భుతమైన రొమాంటిక్ సీక్వెన్స్ కూడా ఉండటంతో -దాన్ని పండించేందుకు చిరు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకు రామ్‌చరణ్ బాగస్వామ్య నిర్మాతగా ఉన్నాడు.