అన్నీ ఉన్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి సినిమాతో తళుక్కుమని.. తరువాత సినిమా కోసం నానా అగచాట్లుపడిన హీరోయన్లు తెలుగు ఇండస్ట్రీలో కోకొల్లలు. కానీ కొంతమంది మొండిగా నిలబడి ధైర్యంగా ముందుకెళ్లి.. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని టాప్ పొజిషన్‌కు చేరినవాళ్లూ లెక్కలేనంత మంది. బెంగళూరు బ్యూటీ నభానటేష్ -నన్నుదోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ మనసు దోచుకుంది. తొలి సినిమా హిట్టయితే అవకాశాలు వాటంతట అవే వస్తాయని అనుకోవడం పొరపాటని నభాని చూసి తెలుసుకోవాలి. నన్ను దోచుకుందువంటే చిత్రంలో సుధీర్‌బాబుతో పండించిన కెమిస్ట్రీ, ఆమె గ్లామర్, నటనకు మంచి మార్కులే పడ్డాయ. తరువాత రామ్‌తో కలిసి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్‌ను ఇస్మార్ట్ శంకర్‌లో చేసింది. ఆ సినిమా హిట్టయనా నభాకు ఆశించిన ఇమేజ్ రాలేదు. చిత్రంగా ఇస్మార్ట్ తరువాత సరైన అవకాశాలూ ఆమెకు రావడం లేదు. కారణమేంటని ఆరా తీస్తే నభా పారితోషికాన్ని 50 లక్షలకు పైగా డిమాండ్ చేస్తుండటమేనని సమాచారం. ప్రస్తుతం ఆమె చేతిలో రవితేజతో నటిస్తున్న డిస్కో రాజా ఒక్కటే వుంది. ఈ అవకాశం అప్పుడెప్పుడో తలుపు తట్టిందే. తరువాత మాత్రం ఒక్క అవకాశం కూడా రాకపోవడం నిజంగా నభాకు ఇబ్బందికరమే. పోనీ పారితోషికాన్ని తగ్గించుకుంటేనన్నా వస్తాయేమో చూడాలి. చాన్స్‌ల కోసం నభా సరికొత్త ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.