తగ్గితే తప్పేంటమ్మా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవిందసమేత చిత్రంలో జూ.ఎన్టీఆర్‌కు పూజాహెగ్దె వేసిన పంచ్ డైలాగ్ ఇది. అఫ్‌కోర్స్.. ఈ రెండు పొడిపదాలే సినిమాకు స్ట్రాంగ్ ట్విస్ట్ కూడా. కథను మలుపు తిప్పడానికి, హీరో ఆలోచనల్లో మార్పు సంకేత సన్నివేశాలు వండుకోడానికి త్రివిక్రమ్ ప్రయోగించిన ప్రాస పంచ్ -తగ్గితే తప్పేంటి? రీల్ డైలాగ్ మాటేమోగానీ, రియల్ లైఫ్‌లో మాత్రం రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రానికి ఇది వర్తిస్తుందన్న చర్చ ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తోంది. ప్రస్తుతం హీరోల రేసులో బాగా వెనకపడిన రవితేజ ‘డిస్కోరాజా’పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. కెరీర్‌ను మళ్లీ మలుపుతిప్పే సినిమా ‘డిస్కోరాజా’ అన్నంత కసితోనూ సినిమా పూర్తి చేశాడు. ఇప్పుడు సినిమా విడుదల విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నాడు. నిజానికి డిస్కోరాజా సినిమా డిసెంబర్ 20న విడుదల కావాలి. ఆ రోజున విడుదలవుతున్న అన్ని సినిమాలకంటే ముందు తేదీని ప్రకటించింది డిస్కోరాజా టీమే. కాకపోతే, అకస్మాత్తుగా మాస్‌రాజా ఫ్యాన్స్‌కి ఓ షాకిచ్చింది. అదే -డిస్కోరాజా డెడ్‌లైన్‌ను నెల వెనక్కి సాగదీయడం. అంటే -వచ్చే జనవరి 24న సినిమా థియేటర్లకు రానుందన్న మాట. కారణాలపై పెద్ద పరిశోధన చేయాల్సిన పని లేదు. డిసెంబర్ 20న బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకునే ఉత్సాహంతో ఆసక్తికరమైన సినిమాలే వస్తున్నాయి. సాయితేజ్- మారుతి కాంబోలో తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా డిసెంబర్ 20న థియేటర్లకు తేనున్నట్టు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అలాగే, ఏటా సంక్రాంతి రేసులో ఉండే బాలకృష్ణ సైతం ఈసారి స్ట్రాటజీ మార్చుకుని డిసెంబర్ 20నే ‘రూలర్’ను థియేటర్లకు తేనున్నాడు. సంక్రాంతి రేసులో భారీ సినిమాలున్నాయి కనుక, ఆ స్లాట్‌లో రిస్క్ ఫేస్ చేయడం ‘రూలర్’ టీంకి ఇష్టం లేదు. బాలయ్య సినిమా ముందుగా వచ్చేయడానికి అదే అసలు కారణం. పైగా ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ రెండు పార్టులూ బాలయ్యకు సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రతి ఏటా సంక్రాంతి రేసులో కచ్చితంగా ఉండే బాలయ్య, ఈసారి స్ట్రాటజీతో గ్యాప్ ఇచ్చాడు. ఇక -డిసెంబర్ 20నే దబాంగ్ 3 తెలుగు వర్షన్ థియేటర్లకు రానుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్లూభాయ్‌కి సౌత్‌లోనూ మంచి మార్కెట్ ఉంది కనుక -దబాంగ్ 3 ప్రభావం మిగిలిన సినిమాలపై ఉండదని గట్టిగా చెప్పలేం. సో, పట్టింపులతో ముందుకెళ్లి రిస్క్‌లో పడేకంటే.. గేమ్‌లో అప్పుడప్పుడూ ‘తగ్గితే తప్పేంటి?’ అన్న సూత్రాన్ని మాస్‌రాజా ఇంప్లిమెంట్ చేస్తున్నాడన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సంక్రాంతి రేసులో వచ్చే సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా -వాటి హడావుడి మహా అయితే పదిరోజులు ఉండొచ్చు. తరువాత కొత్త సినిమాలపై ఆడియన్స్ ఎలాగూ దృష్టి పెడతారు. సో, జనవరి లాస్ట్ వీక్‌లో థియేటర్లకు రావడమే బెటరన్న ఉద్దేశంతో డిస్కోరాజా డేట్‌ను మార్చుకుందని అంటున్నారు. ఏమో.. ఆశించినట్టే అన్నీ జరిగితే ‘డిస్కోరాజా’తో రవితేజ మళ్లీ ఫాంలోకి రావడం ఖాయమేమో.