రష్మిక లుక్కెప్పుడో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్మిక మండన్న. ప్రస్తుతం టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తున్న బ్యూటీ పేరు. అడుగు పెట్టడంతోనే సరైన సినిమాలు పడటంతో -స్టార్ హీరోల సరసన చాన్స్‌లు అందుకుంటోంది. బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ గుర్తింపూ తెచ్చుకుంది. ప్రస్తుతం మహేష్‌బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రం చేస్తోంది రష్మిక. మహేష్‌బాబుతో తొలిసారి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంట. సినిమా యూనిట్ ఇప్పటివరకూ మహేష్‌బాబు, విజయశాంతికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. రష్మిక మండనకు సంబంధించిన లుక్ ఇంతవరకూ విడుదల చేయలేదు. ఎప్పుడు విడుదలచేస్తారా? అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారట. ఆమె సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో వున్న ఫొటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె కాస్ట్యూమ్స్ సరికొత్తగా వున్నాయని, మహేష్‌బాబుకు తగిన జోడీగా రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ అన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు ఆన్ లొకేషన్ స్టిల్స్‌తోనే అభిమానులను ఆకట్టుకుంటోంది రష్మిక. ఈ సినిమా విజయవంతమైతే టాప్ రేంజ్ నుంచి తిరుగులేని రేంజ్‌లోకి రష్మిక చేరడం ఖాయంగా కనిపిస్తోంది.