ఆఖరి షెడ్యూల్‌లో హై 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రాధా క్యూబ్ పతాకంపై మన్నారా చోప్రా ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న చిత్రం హై 5. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- జీవితంలో డబ్బే ప్రధానం కాదని, కుటుంబం, సుఖ సంతోషాలు ప్రధానమని తెలియజెప్పే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈరోజుతో షూటింగ్ పూర్తవుతుందని అన్నారు. గోవాలో వేసిన సెట్‌లో షూటింగ్ చేశామని, మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రంలో వైవిధ్యమైన కథ ఉందన్నారు. లండన్, మలేసియా, బోస్టన్‌లకు చెందిన ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారని, అలాగే మొత్తం 12 పాటలు ఉంటాయని, తమన్, దేవిశ్రీప్రసాద్‌లు కూడా కొన్ని పాటలను కంపోజ్ చేశారని ఆయన అన్నారు. పాత చిత్రాలలో ఉండే పాటల మాదిరిగా చిన్నచిన్న మాటలతో నేటి తరానికి తగినట్లుగా ఈ చిత్రం ఉంటుందని, అలాగే ఓ చిన్న మెసేజ్ కూడా ప్రేక్షకులకు అందిస్తున్నామని ఆయన వివరించారు. జనవరిలో ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, మసాలా డాన్సులు జాస్మిన్, ఛాయ, ప్రణాళి, త్రిప్తి తదితరులు చేశారని, అందరికీ నచ్చే విధంగా సినిమా వుంటుందని నిర్మాత రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో మన్నారా చోప్రా సినిమా విశేషాలను తెలిపారు.