గల్లా రెడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో మహేష్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు అశోక్ గల్లా హీరోగేంట్రం చేయడానికి రంగం సిద్ధమైంది. చాన్నాళ్లుగా అశోక్ అరంగేట్రం కథనం వినిపిస్తున్నా -దర్శకుడు వెతుకలాట కారణంగా ఆలస్యమైంది. సరైన కథతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను కొద్దిరోజుల క్రితమే ఫైనల్ చేసుకున్న గల్లా కుటుంబం, గురువారం లాంఛనంగా పనులు మొదలెట్టారు. శ్రీరామ్ ఆదిత్య గతంలో భలే మంచి రోజు, దేవదాస్, శమంతకమణి చిత్రాలను తెరకెక్కించాడు. ఇదిలావుంటే, కాణిపాకంలోని వరసిద్ది వినాయకుని వద్ద పూజలు నిర్వహించటంతో -అశోక్ హీరోగేట్రం పనులు మొదలైనట్టే. గల్లా పద్మావతి నిర్మాతగా రూపొందనున్న సినిమా నవంబర్ 10న అధికారికంగా లాంచ్ కావొచ్చని అంటున్నారు. అశోక్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నా -సినిమా లాంచింగ్ రోజున చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం సమకూర్చనున్నాడు.