వాట్టే షేప్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒద్దికైన నడుముని ఒడిసిపట్టడం అంత సులువుకాదన్న విషయాన్ని భీష్మ ఫస్ట్ గ్లింప్స్‌లో చెప్పకనే చెబుతున్నాడు హీరో నితిన్. కార్పొరేట్ ఆఫీస్‌లో వయ్యారంగా నడుస్తోన్న రష్మిక మండన్న నడుమందాలను పట్టుకోడానికి ట్రై చేస్తున్న నితిన్‌ని చూపిస్తూ -‘నా లవ్ కూడా విజయ్‌మాల్యా లాంటిది. కనిపిస్తుందికానీ క్యాచ్ చేయలేం’ అన్న క్యాచీ డైలాగ్‌తో ప్రజెంట్ చేయడం బావుంది. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించి ‘్ఫస్ట్ గ్లింప్స్’ను.. దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు విషెస్‌గా గురువారం చిత్రబృందం విడుదల చేశారు. హూందాఅయిన చీరకట్టులో రష్మిక అందాలు చూపిస్తూ నితిన్‌ను రొమాంటిక్‌గా ప్రజెంట్ చేసిన వీడియోకి మహతి స్వరసాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత హైప్ తెచ్చింది. వీడియోతోపాటు ఫిబ్రవరి 21న భీష్మను థియేటర్లకు తెస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. కామెడీ రొమాంటిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.