సాఫ్ట్‌వేర్.. పూర్తి చేశాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా శేఖరా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో కె.శేఖర్‌రాజు రూపొందించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. ధన్య బాలకృష్ణ కథానాయికగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ- ఓ వైవిధ్యమైన కథనంతో సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వుండే చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశామని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సుధీర్ అభిమానులకు ఇదొక విందులా వుంటుందన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ ఒక పాట పాడి నటించడం సినిమాకు ప్లస్ పాయింట్ అంటూ, ఇటీవల మనకు దూరమైన నటుడు శివప్రసాద్ కూడా ఓ పాత్ర చేశారన్నారు. సుధీర్‌కు వున్నక్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేయడానికి ఒప్పుకున్నానని హీరోయిన్ ధన్య అన్నారు. డిసెంబర్ మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని, తప్పక విజయవంతమవుతుందన్న నమ్మకం వుందని నిర్మాత శేఖర్‌రాజు తెలిపారు. మార్చి 20 తన లక్కీ డే అని, ఆ రోజు తన రెండు సినిమాలు షూటింగ్ ప్రారంభమయ్యాయని, మొదటిరోజు అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్‌లో షూటింగ్ ప్రారంభించడం సంతోషాన్నిచ్చిందని హీరో సుధీర్ అన్నారు. బుల్లితెరపై తనను ఆదరించిన ప్రేక్షకులు వెండితెరపై కూడా ఆదరించాలని, అలాగే ఈ చిత్రంలో డాన్సులు, ఫైట్లు ఎలా ఉన్నాయో ప్రేక్షకులే చెప్పాలని హీరో సుధీర్ తెలిపారు. డిసెంబర్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఆయన అన్నారు. ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్, షాయాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.