పూజా' ఫలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేనికైనా టైం రావాలి -సెంటిమెంట్‌ను బలంగా నమ్మే ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే. టైమొచ్చేవరకూ ఓపిగ్గా ఎదురు చూసేవాళ్లే -ఇండస్ట్రీలో సక్సెస్‌లు చూస్తారు. అందాన్ని చూసి ముఖంమీద చెప్పలేకపోయినా -‘సినిమాకి పనికిరాని హీరోయిన్‌వి’ అంటూ కెరీర్ ఆరంభంలో పూజా హెగ్దెమీద ఎన్నో కామెంట్లుపడ్డాయి. ఆమె వెనక్కి పారిపోలేదు. నాకూ ఓ టైమొస్తుందంటూ ఓపిగ్గా ఎదురు చూసింది. ఎదురు చూసిన టైం రానేవచ్చింది. పూజా కెరీర్ జోరులోపడింది. టాప్ టు బోటమ్ -స్టార్ హీరోలకు జోడీ ఆప్షన్స్‌లో పూజ బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఫ్లాపుల్ని చూసిన పూజే.. ఇప్పుడు హిట్లూ చూస్తుంది. వరుస హిట్లు ఆమె కెరీర్ గ్రాఫ్‌ను క్రమంగా పెంచుతున్నాయి. అనుగుణంగా రెమ్యునరేషన్ పెంచుతున్నా -పూజవైపే దర్శక నిర్మాతలు చూస్తున్నారు. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న పూజ -తమిళం, హిందీ చిత్రాలపైనా శ్రద్ధ పెడుతోంది.
దక్షిణాది చిత్రాలపైన ఫోకస్ పెడుతున్న బోనీకఫూర్‌ను ఇటీవల పూజా హెగ్దె మీటవ్వడంతో -కొత్త కథనాలు మొదలయ్యాయి. సౌత్ స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోన్న బోనీ -అజిత్ హీరోగా ‘నెర్కొండ పారవై’ నిర్మించటం తెలిసిందే. అజిత్, హెచ్ వినోత్ కాంబోలో ‘వలిమై’ సినిమానూ చేస్తున్నాడు. తెలుగులో పవన్ రీఎంట్రీ కథనాలకు ఊతమిస్తూ దిల్‌రాజ్‌తో కలిసి ‘పింక్’ రీమేక్‌కూ సన్నద్ధమవుతున్నాడు. ఈ పరిణామాల్లో బోనీ-పూజ మీటింగ్ ఏ ప్రాజెక్టు కోసం? అన్న కథనాలు మొదలయ్యాయి. అజిత్ జోడీగా పూజను ఎంపిక చేశారా? లేదా పవన్‌కు జోడీగా పూజను మాట్లాడుతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు పెద్ద ప్రాజెక్టులే కావడంతో -ఏ ప్రాజెక్టుకు పూజను ఎంపిక చేసుకున్నా ఆమె కెరీర్‌కు పెద్ద బెనిఫిట్టే. కాలం కలిసొస్తే -రెండు పెద్ద ప్రాజెక్టులూ ఆమె ఖాతాలోనే పడొచ్చు.