కండిషన్స్ అప్లై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాజెక్టు చిన్నదైనా పెద్దదైనా నయనతారను ఒప్పించాలంటే -కొన్ని కండిషన్స్‌కు ఓకే చెప్పాలి. ఈ విషయంలో ఎవరెన్ని రకాలుగా అనుకున్న ‘డోన్ట్‌కేర్’ తన స్టైల్ తనదే అంటోంది నయన్. ఏస్ డైరెక్టర్ మురుగదాస్‌కూ ఈ పరిస్థితి తప్పలేదు. రజనీకాంత్‌తో తెరకెక్కిస్తోన్న దర్బార్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు మురగదాస్. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న చిత్రాన్ని సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రజనీతో జోడీ కడుతోంది నయన్. తాజాగా కోలీవుడ్‌లో ఒక కథనం చక్కర్లు కొడుతోంది. గతంలో మురగదాస్ ప్రాజెక్టు గజనీలో చేసిన నయనతార -అప్పటి అనుభవాన్ని గుర్తు చేస్తూ ‘దర్బార్’కు కండిషన్ పెట్టిందట. గజని కథలో నయన్ పాత్ర గురించి ఆమెకు చెప్పింది వేరు, తెరపై చూపించింది వేరట. గజని విడుదల టైంలోనే అసంతృప్తి వ్యక్తం చేసిన నయన్, తన కెరీర్‌లో చేసిన అతి చెత్త పాత్ర అదేనంటూ బహిరంగంగానే కామెంట్లు చేసింది. దర్బర్ సినిమాలో అలాంటి ఎక్స్‌పీరియన్స్ మళ్లీ ఎదురుకాకుండా -పాత్రకు సంబంధించి తనకు చెప్పిన ప్రతి పాయింటూ తెరపై కనిపించాలని కండిషన్ పెట్టిందట. తన కండిషన్‌కు మురగదాస్ మొగ్గచూపిన తరువాతే -ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్న కథనం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.