పాటకొచ్చిన వెంకీమామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, నాగచైతన్యల మల్టీస్టారర్‌గా వస్తున్న సినిమా -వెంకీమామ. కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది. అధికారికంగా ప్రకటించకున్నా -సినిమాను క్రిస్మస్ రోజు డిసెంబర్ 25న రిలీజ్ చేయడానికి ఓ నిర్ణయానికి రావడంతో -ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఫ్యాన్స్‌కి ఓ అప్‌డేట్ ఇస్తున్నట్టుగా గురువారం ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. మామా అల్లుళ్ల మధ్య సాగే ఓ థీమ్ సాంగ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. తమన్ కట్టిన బాణీ అభిమానుల గుండెల్లోకి దూసుకుపోవడం ఖాయమన్న నమ్మకంతో ఉంది వెంకీమామ టీం. నాగచైతన్యతో రాశీఖన్నా, వెంకటేష్‌కు జోడీగా పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.