అదోటైపు కుర్రాడిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పాత్రలో ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారని, అలాంటి పాత్రలే చేయాలన్న ఆలోచనలకు నేను దూరం. నానుంచి వైవిధ్యాన్ని కోరుతున్నారు కనుక -సాధ్యమైనంత వరకూ ప్రయోగాత్మక పాత్రలే చేయాలనుకుంటున్నా
అంటున్నాడు హీరో శ్రీవిష్ణు.
ఇటీవలే ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న శ్రీవిష్ణు -ఇప్పుడు ‘తిప్పరా మీసం..’ అంటూ మరో కానె్సప్ట్‌తో వస్తున్నాడు. రిజ్వాన్ నిర్మాతగా దర్శకుడు కృష్ణవిజయ్ ఎల్ తెరకెక్కించిన చిత్రంలో నిక్కీ తంబోలి హీరోయిన్. నవంబర్ 8న సినిమా థియేటర్లకు వస్తోన్న నేపథ్యంలో శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడాడు.
పబ్‌ల్లో, నైట్ క్లబ్‌ల్లో పనిచేసే విభిన్నమైన మనస్తత్వం కలిగిన డీజే కుర్రాడి కథ ఇది. వాడికి నచ్చినట్టుండే కేర్‌లెస్ ఆటిట్యూడ్. అందుకోసమే 8కేజీల బరువు పెరిగి రగ్‌డ్ అప్పియరెన్స్ ఇచ్చా. ఒకవిధంగా నెగెటివ్ షేడ్స్ రోల్.
ఈ కుర్రాడిది పూర్తిగా నైట్ లైఫ్. తినడం, తిరగడం, పగలంతా పడుకోవడం. మనస్తత్వమే కాదు, రొటీన్‌కి భిన్నమైన లైఫ్ వీడిది.
బ్రోచేవారెవరురా చిత్రంలో నా పాత్రకు మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. అలాగని అన్నీ అలాంటి పాత్రలే చేయాలనుకోను. ప్రతి సినిమాకూ వైవిథ్యం చూపించాలనే ఆశపడతా.
తిప్పరా మీసం సినిమాలో కామెడీ కూడా వైవిధ్యమే. పాత్రల ఆహార్యం, వాటి కదలికలు కూడా నవ్వు పుట్టిస్తాయి. నా పాత్ర ఎంటీ, దాని ప్రతి కదలికా క్రేజీ కామెడీ పుట్టించేదే.
పౌరుషాన్ని ప్రదర్శించాల్సి వచ్చినపుడే -తిప్పరా మీసం అనడం అలవాటైపోయింది. కాని -మగాడిగా కొన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినపుడూ.. ఆ ప్రైడ్ మూమెంట్‌నీ ‘తిప్పరా మీసం’ అన్న దానికి అన్వయించాం.
నిజానికి గత ఫిబ్రవరిలోనే సినిమా పూరె్తైంది. కాకపోతే బ్రోచేవారెవరురా సినిమా తరువాత సరైన స్లాట్ దొరకలేదు. పెద్ద సినిమాల తాకిడి కారణంగా -కొంచెం ఆలస్యంగా థియేటర్లకు వస్తున్నాం.
మూడు నాలుగు సినిమాలకు ముందే కమిటయ్యాను. అందువల్ల రెమ్యునరేషన్ పెంచే అవకాశం లేదు. చాలామంది ఇదే విషయాన్ని అడుగుతుంటే నవ్వొస్తోంది.
మదర్ సెంటిమెంట్‌పై సినిమా నడుస్తుంది. కానీ, తెలుగు సినిమాల్లో ఇంతవరకూ కనిపించని కొన్ని సుతిమెత్తని సీక్వెన్స్ ఉన్నాయి. కంటెంట్ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామాకు అవకాశమిచ్చిన పాయింట్స్ అవి. డెఫినెట్‌గా ఆడియన్స్ కనెక్టవుతారు.
కొడుకు పాత్ర చేయటం ఫస్ట్‌టైం. సీనియర్ ఆర్టిస్ట్ రోహిణితో వర్క్ చేయడం హ్యాపీ. నిజమైన తల్లీకొడుకులన్న భావన ఆడియన్స్‌కు కలుగుతుంది. అంత నేచురల్‌గా చేశాం.
ఉమెన్ ఎంపవర్‌మెంట్ అన్నది నేను చేసిన చాలా చిత్రాల్లో కనిపిస్తుంది. ఈ చిత్రంలోనూ ఉమెన్ రెస్పెక్ట్ ఉంటుంది.
ప్యూచర్ ప్రాజెక్టులు చెప్పాలంటే -మూడు స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి. వాటిలో ఏది ముందుంటుంది అన్నది వారంలో చెప్తా. వచ్చే ఏడాది పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ పేట్రియాటిక్ స్టోరీ చేయబోతున్నా.