ఆదిత్య.. అక్కడ పడిపోయాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడెప్పుడో-
రిషీకఫూర్, డింపుల్ కపాడియా జోడీగా తెరకెక్కిన మ్యూజికల్ లవ్ స్టోరీ -బాబి. ప్రేమ కథలకు అదొక పెద్ద బాలశిక్ష సినిమా. తొలి చూపు, తొలి వలపులోని తీపిని రుచి చూపించే సీన్ ఒకటుంటుంది. రిషీకఫూర్ డింపుల్ ఇంటి తలుపు తడతాడు. ఆమె సున్నిపిండి రాసుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. ఆ తరువాత చెప్పడం కంటే -సీనైనా చూడాలి. చూసినవాళ్లు ఊహకైనా వెళ్లాలి. నిజానికది -దర్శకుడు రాజ్‌కఫూర్ స్వీయానుభవమట. నిజ జీవితంలో నర్గిస్‌ను కలిసిన సీన్ అలాంటిదే. ఏదైనా సినిమాలో చూపించే ప్రయత్నం చేసీ చేసీ -చివరకు కథ సహకరించిన ‘బాబి’తో ముచ్చట తీర్చుకున్నాడు రాజ్‌కఫూర్. చిన్నపుడే ఆ సీన్ మైండ్‌లో బలంగా పడటంతో -దర్శకుడయ్యాక అలాంటి ముచ్చట తీర్చుకోవాలనుకున్న విఎన్ ఆదిత్యకు ఇప్పుడు కుదిరిందట. ఆ ముచ్చటను ‘వాళ్లిద్దరి మధ్య’ చూడొచ్చు అంటున్నాడు ఆదిత్య. ఈ సినిమాతో కెరీర్‌ను ప్రారంభిస్తున్న నేహా కృష్ణపై అలాంటి సన్నివేశానే్న చిత్రీకరించాడట ఆదిత్య. హీరో విరాజ్ అశ్విన్ వినాయకుడి బొమ్మతో చెక్కివున్న హీరోయిన్ ఇంటి తలుపు తడతాడు. హీరోయిన్ నేహాకృష్ణ తలుపుతీస్తుంది. తొలిచూపులోని మాధుర్యాన్ని చూపిస్తూనే -విఘ్న వినాయకుడు వాళ్లిద్దరి ఎలాంటి విఘ్నం కలిగిస్తాడోనన్న సందేహం ఆడియన్స్‌కి తలెత్తేలా సింబాలిక్ షాట్‌ను ఆదిత్య తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఇదే విషయంపై ఆదిత్య స్పందిస్తూ -బాబీలోని ఆ సీన్ నాకొక స్ఫూర్తి. రియల్ లైఫ్‌లో అంకురించిన ప్రేమ -ఓ బ్లాక్‌బస్టర్ సినిమా స్టోరీకి షాట్ అయ్యింది. నిజానికి ఆ సినిమాలో డింపుల్‌పై షూట్ చేసిన ఫస్ట్ షాట్ అది. చిన్నప్పటినుంచీ నాతో ట్రావెలవుతోన్న ఆ సీన్ ఇప్పటికి స్క్రీన్‌పై నా భావనలో చూపించే అవకాశం దక్కింది. కాకపోతే బాబి కథ వేరు. ‘వీళ్లిద్దరి మధ్య’ జరిగే కథ వేరు. అందులో డింపుల్ సున్నుపిండితో ఉంటుంది. ఇందులో ఉండదంతే’ అంటూ చెప్పుకొచ్చాడు. హీరోయిన్ నేహాకృష్ణ అరంగేట్రాన్ని విఘ్నేశ్వరుడి సాక్షిగా చూపించే ఉద్దేశంతోనూ ఈ సీన్‌ని అలా డిజైన్ చేసినట్టు చెబుతున్నాడు ఆదిత్య. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చిత్రాన్ని రూపొందిస్తున్న నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ -షూటింగ్ పూరె్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే సినిమా తేదీని ప్రకటిస్తాం అన్నారు. వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రవౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.