సబ్ ఫీచర్

బుద్ధిమాంద్యం పిల్లలకు మమతల మాధుర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె భర్త ఎపుడూ విధి నిర్వహణలో బిజీగా వుంటాడు.. ఆ దంపతుల కుమారుడు సెర్రిబల్ పాల్సీ, ఆటిజమ్‌లతో బాధపడుతుంటాడు.. బుద్ధి మాంద్యం ఉందన్న కారణంతో ఆ అబ్బాయిని చేర్చుకోవడానికి ఏ పాఠశాల యాజమాన్యమూ ముందుకు రాదు.. ఈ పరిస్థితుల్లో ఇంటినుంచి బయటకు వెళ్ళడానికి ఆమెకు ఎలాంటి అవకాశం లేదు. మానసిక వికలాంగుడైన పిల్లవాడిని అనుక్షణం వేయికళ్లతో కనిపెట్టుకొని ఉండాలి. తమ కుమారుడిని బడిలో చేర్చుకోవాలని ఇతరులను ప్రాధేయపడేకంటే, తానే స్వయంగా ఒక పాఠశాలను ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన ఆమె మదిలో మెదిలింది. ఆ ఆలోచనే నేడు ఎంతోమంది మానసిక వికలాంగులకు కొత్త జీవితాలను ప్రసాదిస్తోంది.
అస్సాం రాజధాని గౌహతిలో ఉంటున్న రూపా హజారికాకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన రిషి పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ, ఆటిజమ్‌ల కారణంగా మానసిక వికలాంగుడయ్యాడు. ఆమె భర్త అటవీ శాఖ అధికారి. విధి నిర్వహణలో భాగంగా తరచూ క్యాంపులకు వెళ్తూంటాడు. రిషికి తగిన వైద్యం చేయించడం కోసం ఆ దంపతులు చాలా ప్రాంతాలు తిరిగారు. అయినా ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.రిషికి జీవితాంతం ఎవరో ఒకరి రక్షణ, మార్గదర్శకం కావాల్సిందేనన్న విషయం కొన్నాళ్లకు రూపాకి అర్థం అయింది. రిషిని పాఠశాలలో చేర్పించడానికి ఆమె విఫలయత్నం చేశారు. చివరికి తన ఇంట్లోనే మానసిక వికలాంగుల కోసం పాఠశాలను ఏర్పాటుచేయాలని రూపా 2005 నిర్ణయించారు. రిషితో పాటు మానసిక వికలాంగులైన ఎంతోమంది పిల్లలకు చేయూత ఇచ్చి, వారి తల్లిదండ్రులకు కొంత వెసులుబాటు కల్పించాలన్నది ఆమె ఆలోచన.
మానసిక వికలాంగుల కోసం బడిని ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో ఆమె ప్రకటన ఇచ్చాక తొలుత ఎనిమిదిమంది పిల్లలు పాఠశాలలో చేరారు. ఆమె ప్రారంభించిన పాఠశాల అనతికాలంలోనే విశేష ప్రాచుర్యం పొందింది. వివిధ వయసులకు చెందిన పిల్లలకే గాక మానసిక రోగాలతో బాధపడే వృద్ధులకు కూడా ఆమె అండగా నిలిచారు. రూపా చేస్తున్న సేవకు పలు కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం నుంచి సహాయం అందటం ప్రారంభం అయింది. సంస్థ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో చిన్నారులకు కంప్యూటర్ శిక్షణతోపాటు పేపర్ బ్యాగ్స్ తయారీ, ఎంబ్రాయిడరీ, కవర్లు, గ్రీటింగ్ కార్డుల తయారీలో మెళకువలను ఆమె నేర్పుతున్నారు. రూపా నిర్వహిస్తున్న సంస్థలో 27 మంది సహాయకులు, ఫిజియోథెరపిస్ట్‌లు, మానసిక వైద్యులు ఉన్నారు. మానసిక వికలాంగుల సేవలో ఎంతో ఆత్మసంతృప్తి ఉందని రూపా చెబుతుంటారు.

-పి.హైమావతి