జాతీయ వార్తలు

చిదంబరంకు ఈడీ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఏయిర్ ఇండియాకు నష్టం కలిగిస్తూ జరిగిన భారీ కుంభకోణం, అక్రమ నగదు చెలామణి కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం ఈనెల 22న అధికారుల ఎదుట హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. 2008-09 మధ్య కాలంలో విదేశీ ప్రయివేటు విమాన సంస్థలకు ఎయిర్‌ స్లాట్స్‌ కేటాయించడంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఈ కుంభకోణం కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీగా నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.