జాతీయ వార్తలు

సుప్రీం కోర్టును ఆశ్రయించిన చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయకపోవటాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఈ మేరకు చిదంబరం తరపున పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై మంగళ లేదా బుధవారంనాడు విచారణ చేపడతామని జస్టిస్ బోబ్డే ధర్మాసనం పేర్కొంది. ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి చిదంబరం గత 90 రోజులుగా తీహార్ జైలులో ఉంటున్నారు. ఆయన జ్యూడిషయల్ రిమాండ్‌ను ఈ నెల 27 వతేదీ వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించిన విషయం విదితమే.