రాష్ట్రీయం

బ్రిడ్జిలే చెక్‌డ్యామ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దృష్టంతా సాగు నీటిరంగంపైనే.. వాన నీటినీ ఒడిసిపట్టే ప్రయత్నం
భారీగా నిధుల కేటాయింపునకు కసరత్తు
కొత్త ప్రణాళికలతో సర్కారు అడుగులు

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ సమస్యల శాశ్వత పరిష్కారానికి సాగునీటిపై దృష్టిపెట్టిన తెరాస ప్రభుత్వం, ఇరిగేషన్ రంగంపై సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి దాదాపు 75 వేల కోట్లు ఖర్చవుతుంది. వరుసగా మూడేళ్లపాటు ప్రాజెక్టులకు ఏటా 25వేల కోట్లు కేటాయించి ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో నీటి వనరుల రక్షణకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 45 వేల చెరువుల పునరుద్ధరణలో మొదటి దశ విజయవంతంగా కాగా, ఇప్పుడు రెండో దశను జనవరి నుంచి చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలు వినియోగించుకోవడంతో పాటు వర్షపు నీటిని సైతం ఒడిసిపట్టే అంశంపై తెరాస సర్కారు ప్రణాళికలు రచ్చిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా వినూత్న తరహాలో బ్రిడ్జిలన్నీంటినీ చెక్ డ్యామ్‌లుగా ఉపయోగపడేలా నిర్మించాలన్న యోచన చేస్తోంది. ఇప్పటివరకు నిర్మించిన బ్రిడ్జిలను స్వల్ప ఖర్చుతో చెక్ డ్యామ్‌లుగా మార్చనున్నట్టు అధికార్లు చెబుతున్నారు. ఒకవైపు ఇప్పటికే నిర్మించి ఉపయోగంలోవున్న బ్రిడ్జిలను చెక్ డ్యామ్‌ల మాదిరి ఉపయోగపడేలా మార్చడంతోపాటు, కొత్తగా నిర్మించే వాటి డిజైన్‌లు చెక్ డ్యామ్‌లకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 250 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి డిజైన్‌లు, నిధుల విడుదల వంటివన్నీ పూర్తయ్యాయి. ఈ 250 బ్రిడ్జిలు కూడా చెక్ డ్యామ్‌లుగా ఉపయోగపడున్నాయి. బ్రిడ్జిలు చెక్‌డ్యామ్‌లుగా ఉపయోగపడేట్టు నిర్మిస్తే, ఆ ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడు నీరు నిల్వఉంటుంది. సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. కర్నాటక అల్మట్టి ప్రాంతంలో, మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు ప్రాంతంలో ఇదేవిధంగా బ్రిడ్జిలను సైతం చెక్‌డ్యామ్‌లుగా నిర్మించి నీటిని వినియోగించుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉద్యమ సమయంలో ప్రధాన అంశంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తరువాత సిఎం ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించారు. కృష్ణా, గోదావరి నదుల ప్రవాహం, రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఆరునెలల పాటు అధ్యయనం చేసి సిఎం ఒక అవగాహనకు వచ్చారు. ఉభయ సభల ఉమ్మడి సమావేశం నిర్వహించి రీఇంజనీరింగ్‌పై వివరించాలని తొలుత సిఎం నిర్ణయించారు. ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై అఖిలపక్ష సమావేశం సైతం నిర్వహించాలని అనుకున్నారు. దీనికి సంబంధించిన వార్తలు వచ్చాక వివిధ రాజకీయ పక్షాలు విమర్శించడంతో సమావేశం నిర్వహించలేదు.
జనవరి చివరివారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చసాగే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే ప్రాజెక్టుల నిర్మాణం మూడేళ్లలో ఏవిధంగా పూర్తి చేయనుందీ ముఖ్యమంత్రి వివరిస్తారు. తొలిదశలో ఎనిమిది వేలకు పైగా చెరువుల పూడిక తీసివేయడం వల్ల ఏవిధమైన ప్రభావం చూపించిందో, నీటి నిల్వ ఆ చెరువుల్లో ఏవిధంగా పెరిగిందో సభలోనే వివరించాలని సిఎం నిర్ణయించుకున్నట్టు మంత్రులు చెబుతున్నారు. పలు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పెండింగ్‌లో పడిపోవడంతో గత మూడునెలల నుంచి వాటిపై దృష్టి సారించారు. పరిహారం పెంచడం ద్వారా భూసేకరణను వేగవంతగా చేయగలినట్టు మంత్రులు అంటున్నారు.
గోదావరి జలాలు ఆంధ్ర, తెలంగాణ వాడుకున్న తరువాత కూడా 16 వందల టిఎంసిలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తిచేయడం ఒక్కటే మార్గమని తెరాస సర్కారు భావిస్తోంది. సాగునీటి రంగంపై సిఎం వేగాన్ని దృష్టిలో పెట్టుకునే, మూడేళ్లలో ప్రతి గ్రామంలోని చెరువూ నీటితో కళకళలాడుతుందని, ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందేలా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.