రాష్ట్రీయం

అన్నిస్థాయిల్లో చర్చించాకే బాక్సైట్‌పై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖనిజ తవ్వకాలపై శే్వతపత్రం విడుదల చేసిన సిఎం చంద్రబాబు

విజయవాడ, నవంబర్ 24: బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన యదార్ధ సమాచారాన్ని ప్రజల ముందుంచి అన్నిస్థాయిల్లో పూర్తిస్థాయి చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రధానంగా గిరిజనులు, మేధావులు, ప్రజల్లో పూర్తిస్థాయి చర్చ జరగాలన్నారు. ఇదే సమయంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలను పటిష్టం చేయటం ద్వారా గిరిజన ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. గిరిజనాభివృద్ధి ఉప ప్రణాళికకు బడ్జెట్‌లో 2వేల కోట్లు కేటాయించామన్నారు. మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఎం బాబు బాక్సైట్ తవ్వకాలపై 18 పేజీలతో శే్వతపత్రం విడుదల చేశారు. బాక్సైట్ సంపదలో రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందని, ఇందులో 21.65 శాతం విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్నాయన్నారు. గిరిజనుల ప్రయోజనాలను పక్కనబెట్టి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా గత ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన రాస్-ఆల్-కైమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. 2007 ఫిబ్రవరి 14న జరిగిన ఒప్పందం ప్రకారం 224 మిలియన్ మెట్రిక్ టన్నుల బాక్సైట్ ఖనిజాన్ని ఆ సంస్థకు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సంస్థ ఏటా 2.5 లక్షల టన్నుల అల్యూమినియాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో విస్తరించిన జెర్రిల్లా ప్రాంతానికి చెందిన 1649 హెక్టార్లలోని 224 మిలియన్ టన్నుల బాక్సైట్ ఖనిజాన్ని అప్పటి ప్రభుత్వం ఈ సంస్థకు కేటాయించిందన్నారు. ఆ సంస్థ భారతదేశంలో అనురాగ్ అల్యూమినియం లిమిటెడ్ అనే పేరున హైదరాబాద్‌లో ఒక కంపెనీని ప్రారంభించిందన్నారు. ఈ కంపెనీలో పెన్నా కంపెనీలకు 70 శాతం వాటా, రాస్-ఆల్-కైమాకు 30 శాతం నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదుర్చుకున్నాయన్నారు. అయితే ఈ పెట్టుబడుల నిష్పత్తిలో ఆ సంస్థ పెట్టుబడి 30 శాతం నుంచి 13శాతానికి తగ్గించడం, పెన్నా గ్రూపునకు 70నుంచి 87 శాతానికి పెంచటం జరిగిందన్నారు. ఒప్పందంలో భాగంగా అల్యూమినియం ప్లాంట్ కొనసాగింపు సైతం ప్రైవేట్ కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా ఖనిజ సంపద తవ్వటం పూర్తవటం వరకు లేదా ప్లాంట్ జీవితకాలం పూర్తవటం వరకు ఏది ముందు అయితే అప్పటికి అవకాశం కల్పించటం జరిగిందన్నారు. గతంలో జరిగిన యదార్ధ సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ తాము ప్రకటిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
గిరిజనులకు అరకు, పాడేరులలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా 18 రకాలైన వ్యవసాయ ఉత్పత్తులు పండించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఉత్పత్తులకు 40 నుంచి 50 శాతం అదనపు ధర పలుకుతుందన్నారు. బాక్సైట్ తవ్వకాలపై తనకు సమాచారం లేకుండానే అటవీశాఖాధికారులు జారీ చేసిన జీవోపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయంటూ, తాను మొదటి నుంచి పూర్తిస్థాయి చర్చ జరిగిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వచ్చిన విషయాన్ని మరువరాదన్నారు. మరో రెండు, మూడురోజుల్లో సాగునీటి పారుదలపై ఒక శే్వతపత్రం ప్రజల ముందు ఉంచుతామన్నారు. రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకుగాను పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేయాలనేది తమ లక్ష్యంగా చంద్రబాబు చెప్పారు. ఇకపై వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టి సారించి రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. విలేఖరుల సమావేశంలో భూగర్భ గనులశాఖ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) మైనింగ్‌పై అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు