రాష్ట్రీయం

చండీయాగానికి రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

18న హైదరాబాద్‌కు రాక
31వరకూ ఇక్కడే శీతాకాల విడిది
24 లేదా 26న యాగానికి హాజరు
ఖరారు అయిన పర్యటన
హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్ పర్యటనకు వస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన చండీయాగానికి కూడా హాజరవుతారు. 23న ప్రారంభమవుతున్న చండీయాగంలో 24నగానీ, 26నగానీ రాష్టప్రతి పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 18 నుంచి 31 వరకు 13 రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం చేస్తారు. శీతాకాల విడిది కోసం సికింద్రాబాద్‌లోని రాష్టప్రతి నిలయంలో బస చేయడానికి రాష్టప్రతి ఇక్కడికి వస్తున్నారు.
రాష్టప్రతి పర్యటన కార్యక్రమం అధికారికంగా ఖరారు కావడంతో ఆయన ఇక్కడ పాల్గొననున్న కార్యక్రమాలు, విడిది వద్ద కల్పించిన భద్రతా చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం సచివాలయంలో పోలీసు, రెవిన్యూ, ఆర్మీ, కంటోనె్మంట్, ట్రాన్స్‌కో, జిహెచ్‌ఎంసి, మెట్రోవర్క్స్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన మిలటరీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 27న జరగబోయే ఇండియన్ ఎకనమిక్స్ అసొసియేషన్ వార్షికోత్సవంలో కూడా రాష్టప్రతి పాల్గొంటారని రాజీవ్ శర్మ వివరించారు. ఈ సమావేశంలో జిఎడి ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, పోలీసు ఐజీలు అంజన్‌కుమార్, మహేశ్ భగవత్, కంటోనె్మంట్ బోర్డు సిఇఓ సుజాత గుప్తా, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్వీందర్ సింగ్, సమాచార శాఖ డైరెక్టర్ వి సుభాష్ తదితర అధికారులు పాల్గొన్నారు.