రాష్ట్రీయం

డిసెంబర్‌లో చలో పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగుల విభజన సమస్యలపై కదం తొక్కనున్న టిఎన్‌జివోలు
హైదరాబాద్, నవంబర్ 23: ఉద్యోగుల విభజన సమస్యలపై డిసెంబర్ 2వ వారంలో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టిఎన్‌జివో) హెచ్చరించింది. టిఎన్‌జివో రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం టిఎన్‌జివో భవన్‌లో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రవీందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఉద్యోగుల విభజన అస్తవ్యస్తంగా మారిందని, స్థానికత ఆధారంగా విభజన జరగాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా జరగడాన్ని అడ్డుకుంటామని కారం రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేసి, స్థానికత ఆధారంగా ఉద్యోగులను ఆయా రాష్ట్రాలకు కేటాయించాలని తమ సంఘం డిమాండ్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల విభజన సమస్యను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆందోళన బాట పట్టక తప్పడం లేదని రవీందర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల పథకంలో ఎదురైన అవరోధాలను పరిష్కరించి, అన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో నగదురహిత సేవలు అందించాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరుతూ తీర్మానం చేసినట్టు రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ప్రీమియం చెల్లించడానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పదవ పిఆర్‌సి బకాయిలను వెంటనే చెల్లించాలని, 10-7-2015 నుంచి బకాయిపడిన కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని కార్యవర్గం తీర్మానం చేసినట్టు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 23, 24 తేదీలలో వరంగల్ నగరంలో జరుగబోయే అఖిల భారత మహిళా ఉద్యోగుల సదస్సును ప్రారంభించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అంగీకరించడం పట్ల రాష్ట్ర కార్యవర్గ కృత్ఞతలు తెలియజేసినట్టు ఆయన తెలిపారు. అలాగే సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాష్ట్ర కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిందని రవీందర్‌రెడ్డి తెలిపారు. జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.