రాష్ట్రీయం

మే 8న ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

23న ఎడ్‌సెట్
26న పిజి సెట్
28న లాసెట్
16న ఐసెట్
హైదరాబాద్, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో 2016-17 విద్యాసంవత్సరానికి జరిగే అడ్మిషన్లకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సెట్‌ల నిర్వాహక వర్శిటీలను, కమిటీల చైర్మన్లను, కన్వీనర్లను సైతం ఖరారు చేసినట్టు గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 2016 మే 8న ఎమ్సెట్‌ను నిర్వహిస్తారు. ఎమ్సెట్‌లో ఈసారి ప్యాటర్న్ మార్చలేదని, గత ఏడాది ప్యాటర్న్‌లోనే నిర్వహిస్తామని వెల్లడించారు. 7న పిసెట్‌ను నిర్వహించనున్నారు. ఇసెట్‌ను మే 9న, ఎడ్‌సెట్‌ను మే 23న, పిజిసెట్‌ను మే 26న, లాసెట్ యుజిని 28న, అదేవిధంగా ఐదేళ్ల లాసెట్‌ను కూడా మే 28న నిర్వహిస్తారు. ఎంబిఎ, ఎంసిఎల్లో ప్రవేశానికి ఐసెట్‌ను మే 16న నిర్వహిస్తారు. పిజి సెట్‌ను, ఎమ్సెట్‌ను జెఎన్‌టియు కాకినాడకు అప్పగించారు. ఇసెట్ నిర్వహణ బాధ్యతను జెఎన్‌టియు అనంతపురానికి, ఐసెట్ బాధ్యత ఆంధ్ర వర్శిటీకి, ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యత ఎస్వీయుకు, పిజి ఇసెట్ బాధ్యత జెఎన్‌టియుకెకు, లాసెట్ ఎస్వీయుకు, పిజి లాసెట్‌ను సైతం ఎస్వీయుకు, పిఇ సెట్ బాధ్యత ఆచార్య నాగార్జున వర్శిటీకి అప్పగించినట్టు చెప్పారు. ఈసారి వర్శిటీల్లో ర్యాగింగ్‌కు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. అన్ని వర్శిటీల్లో ర్యాగింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టామన్నారు.