సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సిట్‌డౌన్..’ అతని సెల్యూట్ రిసీవ్ చేసుకుని అన్నాడు కమీషనర్. ఆ తర్వాత యుగంధర్ వైపు చూసి తలూపేడు.
ఆ రూములో అందరూ చూడటానికి వీలుగా అమర్చిన టివి దగ్గరకు నడిచాడు యుగంధర్. డివడిలో ఓ కేసెట్ ఉంచి ఆన్ చేసి తిరిగొచ్చి తన సీటులో కూర్చున్నాడు. తెర మీద ఓ గది, అందులో డబుల్ కాట్ బెడ్ ప్రత్యక్షమయ్యాయి. వయసు మీరిన పురుషుడు, వయసులో ఉన్న అమ్మాయితో జరిపిన శృంగారం అది.
ఆ దృశ్యాలు చూసి సన్నటి వణుకు మొదలయింది స్పెషల్ బ్రాంచ్ అధికారి శరీరంలో. ఆ గది చల్లగా ఉన్నా అతని శరీరం చెమటతో తడిసిపోయింది. అవమాన భారంతో ముఖం మాడిపోయింది. పది నిమిషాల తర్వాత రిమోట్‌తో టి.వి. ఆపేశాడు కమీషనర్. ఆ గదిలో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం పేరుకుంది.
కమీషనర్ గొంతు ఖంగుమని వినిపించసాగింది.
‘మనిషికి బలహీనతలు ఉంటాయి. అవి లేకుండా ఉండే మనుషులు చాలా అరుదు. కాని ఆ బలహీనతలు కుటుంబానికి, కూడుపెడుతున్న ఉద్యోగానికి చెడ్డపేరు తెచ్చేది అయితే దాన్ని వదులుకోవాలి. ఇప్పుడు మనం చూసింది ఓ మనిషిలోని చీకటి కోణం కదా. ఈ సమాజంలో నిశ్శబ్దంగా జరుగుతున్న చీకటి వ్యాపారం. ఈ కేసెట్ చూసేదాకా అందులో ఏముందో ఎవరికీ తెలియదు. కొన్ని గంటల క్రితం ఓ మనిషి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది’ ఆగి, అందరి ముఖాలు ఓసారి చూసి తిరిగి చెప్పసాగేడు.
‘ఈ బిజినెస్ ఎంతకాలం నుంచి జరుగుతున్నదో మనకి తెలియదు. ఇలాంటి కేసెట్లు వాళ్ల దగ్గర ఇంకా ఉంటాయి. వాటిలో మనవాళ్లు ఎందరున్నారో తెలియదు. ఒక్క కేసెట్ మీడియాకి చిక్కితే మన డిపార్ట్‌మెంట్ పరువు గంగలో కలిసిపోవడమే కాదు మన జాతకాలు తారుమారవుతాయి. అందుచేత ఇక నుంచి మీరంతా జాగ్రత్తగా ఉండండి’ ముగించాడు.
ఆ గది నుండి ఒక్కొక్కరే బయటకు నడిచారు. చివరికి యుగంధర్ మిగిలాడు.
‘ఈ నెట్‌వర్క్‌ని సమూలంగా నాశనం చెయ్యాలి’ కోపంగా అన్నాడు కమీషనర్.
‘యస్ సార్!’
‘వాళ్ల దగ్గరున్న కేసెట్ ఒక్కటి కూడా బయటకు రాకూడదు. మూడో కంటికి తెలియకుండా జరిగిపోవాలి.’
‘అలాగే సార్’ చెప్పి సెల్యూట్ చేసి కేసెట్ తీసుకుని బయటకొచ్చాడు యుగంధర్.
* * *
కంట్రోలు రూమ్‌కి ఎదురుగా వస్త్ర వ్యాపారుల సంఘం నిర్మించిన విశ్రాంతి భవనం ఒకటి ఉంది. ఆ విశ్రాంతి భవనంలోని రూము నెంబర్ నూట రెండు తలుపు తట్టాడు రాజేష్. కొన్ని క్షణాల తర్వాత రాసమణి తలుపు తీసింది.
‘షరీఫ్‌ని అరెస్టు చేసారు?’ చెప్పాడు ఆమెతో.
‘హత్య తనే చేసానని ఒప్పుకున్నాడా?’ అడిగింది రాసమణి.
‘నిన్న సాయంకాలం నుంచి అదే పనిలో ఉన్నాడు యుగంధర్. తనకి చెప్పకుండా నిన్ను ఎక్కడికీ వెళ్లొద్దన్నాడు’
‘ఎందుకు? స్టేట్‌మెంట్ తీసుకున్నారుగా...’
‘ఈ కేసులో నువ్వు ముఖ్యమైన సాక్షివి కాబట్టి అలా చెప్పి ఉంటాడు’
మంచం మీద కూర్చున్నాడు రాజేష్. ఆ పక్కనే ఆదమరచి నిద్రపోతోంది చంటిపిల్ల. తలస్నానం చేయించి కడుపునిండా అమ్మ పాలిస్తే ఇంకేం పని ఉంటుంది నిద్రపోవడం తప్ప. తన మనసులో కదిలిన ఆలోచనకి చిన్నగా నవ్వుకుని కుడిచేత్తో ఆ పిల్ల బుగ్గ తడిమాడు. చప్పున తలతిప్పి రాసమణిని అడిగేడు,
‘ఒళ్లు ఇంత వేడిగా ఉందేమిటి?’
ఆమె గబగబా మంచం సమీపించి నుదుటి మీద చెయ్యి వేసింది.
‘నిజమే.. నిప్పులా కాలిపోతోంది’ ఆమె గొంతులో ఆందోళన.
వాళ్లిద్దరూ కొన్ని నిమిషాల్లో బయటకొచ్చారు. రాజేష్ బైక్ సెవన్ హిల్స్ హాస్పిటల్ వైపు దూసుకుపోయింది. రిసెప్షన్‌లో విషయం చెప్పాడు.
‘కేష్ కౌంటర్‌లో పదివేలు డిపాజిట్ చెయ్యండి’ చెప్పింది రిసెప్షనిస్టు.
రాజేష్ తన క్రెడిట్ కార్డుతో డిపాజిట్ చెల్లించాడు. తర్వాత రాసమణిని అడిగేడు,
‘రమణిమాలని తీసుకురానా?’
సంశయంగా చూసిందామె.
‘షరీఫ్ స్వేచ్ఛగా లేడు కాబట్టి భయపడక్కర్లేదు. భూపతికి నీ సమస్య కంటే పెద్ద సమస్య యుగంధర్ రూపంలో ఎదురైంది. అందుచేత ఇప్పుడు మీ గురించి పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు’ నవ్వేడు రాజేష్.
పిల్లని పరీక్షించి ఎడ్మిట్ చేసుకుని వైద్యం ప్రారంభించేడు డాక్టర్.
రాసమణిని తీసుకుని సెవెల్ హిల్స్‌కి వచ్చినట్టు యుగంధర్‌కి మెసేజ్ పెట్టాడు రాజేష్. ఆ తర్వాత లాసన్స్ బే కాలనీకి వెళ్లి రమణిమాలని తీసుకొచ్చాడు. అవసరమైతే కాల్ చెయ్యమని చెప్పి క్రైం బ్రాంచ్‌కి బయలుదేరాడు.
టార్చ్ సాయంతో బిల్డింగ్ చుట్టూ తిరిగి తన గది దగ్గరకు వచ్చాడు వాచ్‌మాన్. నిద్రపోవడానికి ముందు అతను చేసే చివరి పని అది. సాగర్‌నగర్ సిటీకి దూరంగా ఉండటంవల్ల రాత్రి తొమ్మిది గంటలకే ఊరు సద్దుమణుగుతుంది. అప్పుడప్పుడూ వచ్చే వాహనాలు తప్ప మనుషులు తిరగరు. ఆ బిల్డింగ్ దూరంగా పొలాల్లో ఉండటం చేత ఇరవై నాలుగు గంటలూ నిశ్శబ్దంగా ఉంటుంది.
గదిలోకి ప్రవేశించి తలుపు గడియ పెట్టాడతను. ఫ్యాన్ స్విచ్ నొక్కి ఓ డొక్కు కుర్చీలో కూర్చున్నాడు. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బ్యాగ్ దగ్గరకు లాక్కుని జిప్ తీశాడు. లోపల నుంచి క్యారేజి, వాటర్ బాటిల్ తీసి బయటపెట్టాడు. బ్యాగ్ అడుగు వరకూ వెళ్లి క్వార్టర్ బాటిల్‌తో బయటకొచ్చింది కుడిచెయ్యి. కిటికీ అంచున బోర్లించిన ప్లాస్టిక్ గ్లాసు అందుకుని అందులో మందు పోసి కొంచెం నీళ్లు కలిపాడు. ఓ గుక్క మందు తాగి బీడీ వెలిగించాడు.
నైట్ డ్యూటీకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మందు తెచ్చుకుని తాగడం అతని అలవాటు. అలా తాగుతూ చాలా సమయం గడుపుతాడు. ఆ సమయంలో అతని బుర్రలో ఆలోచనలు పరిగెడతాయి. అవి ఎన్నో రకాలుగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైంది సెక్స్ గురించి. ఇప్పుడంటే వయసు మీద పడి కాస్త జోరు తగ్గింది కాని ఒకప్పుడయితే అనుక్షణం పార్ట్‌నర్ కోసం కళ్లు వెతికేవి. రోడ్డు మీద ఆడది కనపడితే చాలు చీర వెనుక శరీరం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అవుననే వాళ్లు, కాదనే వాళ్లు - అవునూ కాదూలకి మధ్య ఒళ్లు అప్పగించిన వాళ్లు ఇలా ఎన్నో జ్ఞాపకాలు.
మనం ఎంత పాత్ర తీసుకెళితే అన్ని నీళ్లే తెచ్చుకోగలమట. అతని థియరీ ప్రకారం సెక్స్ కూడా అంతే. అతనికి జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి. అవన్నీ దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది. మందు తాగుతున్న ఆ నిశ్శబ్ద నిశీధి సమయంలో ఒక్కొక్కటి పలకరిచి పులకరింపజేసి పోతుంది. ఇప్పటికీ ఆలోచనే అతడ్ని ఉత్తేజితుడ్ని చేస్తుంది. ఆ సమయంలో ఓ ఆడది పక్కన ఉంటే అతను కవిత్వం చెప్పగలడు. అది వీలు కాదు కాబట్టే కళ్లు తెరిచి కలలు కంటాడు.
కాలింగ్ బెల్ మోగిన చప్పుడు వినిపించింది.
మందులో ముందు అది తన భ్రమ అనుకున్నాడు. రెండోసారి కూడా వినిపించేసరికి వాస్తవ ప్రపంచంలో పడ్డాడు. ఆ సమయంలో అక్కడికి ఎవరొచ్చారో అర్థంకాలేదు. టార్చి అందుకుని రూము బయటకు వచ్చి గేటు సమీపించాడు. చిన్న తలుపు తెరిచి టార్చి వెలుగులో షరీఫ్ ముఖం కనిపించడంతో గేటు తెరిచాడు.
ఎవరో ఇద్దరు లోపలికి వచ్చి నోట్లో గుడ్డలు కుక్కి గదిలోని కుర్చీకి కదలకుండా కట్టేసారు. అదంతా క్షణాల్లో జరిగిపోయింది.
ఆ ఇద్దరితోపాటు మరో ఆరుగురు బిల్డింగ్ వైపు నిశ్శబ్దంగా కదిలారు.
* * *
‘నీ పేరు?’ అడిగేడు యుగంధర్.
‘గంగోత్రి..’
‘నీ వృత్తేమిటి?’
‘్భపతి దగ్గర పని చేస్తున్నాను.. ఇంతకీ అర్ధరాత్రి మా ఇంటి మీద దాడి చేసి నన్ను తీసుకురావడానికి కారణం ఏమిటి?’
అప్పుడు ఉదయం పదకొండు అయింది సమయం. క్రైం బ్రాంచ్ ఇంటరాగేషన్ రూము అది. గంగోత్రి పొడవాటి జుట్టు ముడి ఊడిపోయి భుజాల మీద పరచుకుంది. రాత్రి అంతా నిద్రలేకపోవడంతో కళ్లు చింతనిప్పులా ఉన్నాయి.
‘వివేక్‌ని చంపిన నేరానికి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను’ చెప్పాడు యుగంధర్.
‘వివేక్ ఎవరు? అతనికి నాకూ సంబంధం ఏమిటి?’ చురుగ్గా అడిగేడు గంగోత్రి.
‘నీ ఆజ్ఞ ప్రకారం వివేక్‌ని చంపిన షరీఫ్ నేరం అంగీకరించాడు. వివేక్‌ని ట్రాప్ చెయ్యడానికి వాడుకున్న అమ్మాయి అప్రూవర్‌గా మారింది’
నవ్వేడు గంగోత్రి.
‘హత్య చేసిన వాడు షరీఫ్. అప్రూవర్‌గా మారిన అమ్మాయి తనని షరీఫ్ ఉపయోగించుకున్నాడని చెబుతుంది. దీనిలో నా పాత్ర ఏమిటి?’
‘వివేక్ నీ దగ్గర మేల్ ప్రాసిట్యూట్‌గా పని చేస్తున్నాడు. నీ ఇంట్లో రహస్యంగా దాచిన సి.డి.లు మొత్తం స్వాధీనం చేసుకున్నాం. సి.డి. ఉంచిన కవరు మీద వివరాలు రాయడం వల్ల ఎంతమంది నీ వలలో చిక్కారో తెలుస్తోంది. ఒక సి.డి.లో వివేక్ ఓ అమ్మాయితో గడిపిన దృశ్యాలున్నాయి.’
(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994