సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో సూట్ నెంబర్ వన్‌లో ముగ్గురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు యూనిఫాంలో ఉంటే ఒకతను లాల్చీ పైజామాలో ఉన్నాడు. ఇంతలో సెల్ మోగంతో లాల్చీ పైజామా వ్యక్తి కాల్ రిసీవ్ చేసుకున్నాడు. అవతలి వాళ్లు చెప్పింది విని ‘సరే’ అని కట్ చేశాడు. ఎదురుగా కూర్చున్న యూనిఫాం వ్యక్తులతో చెప్పాడతను.
‘ఇవాళ దాదాపు చాలా వర్క్ పూర్తయింది. మిగతాది రేపు మార్నింగ్ కంప్లీట్ చేసి ఈవెనింగ్ ఫ్లైట్‌కి వెళతాను. మీరు వెళ్లండి. ఇప్పటికే ఆలస్యమైంది’
ఆ ఇద్దరూ లేచి అతనికి సెల్యూట్ చేసి బయటకు నడిచి తలుపు శబ్దం రాకుండా మూశారు. గదిలో మిగిలిన లాల్చీ పైజామా వ్యక్తి రెండు చేతులు తల వెనుక పెట్టుకుని రిలాక్స్‌గా కూర్చున్నాడు. అతని మెడ కండపట్టి బలిసి ఉంది. అతను తొడుక్కున్న లాల్చీ నుంచి పొట్ట స్పష్టంగా కనిపిస్తోంది. ఓ అయిదు నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ నొక్కాడతను. గెస్ట్‌హౌస్ అటెండెంట్ లోపలకి వచ్చి సెల్యూట్ చేశాడు.
‘అన్నీ సర్దు...’ చెప్పాడు.
షివాస్ రీగల్ విస్కీ బాటిల్, షోడా, కూల్‌డ్రింక్, గ్లాసులు, ప్లేటుతో జీడిపప్పు టీ పాయ్ మీద చకచకా సర్దాడతను.
‘నా కోసం మా బంధువు ఒకామె వస్తుంది. తీసుకురా. ఇద్దరికీ డిన్నర్ ప్రిపేర్ చెయ్యాలి. నాకు మాత్రం రెండు పుల్కాలు చాలు. కామత్ నుంచి చికెన్ జాయింట్స్, ఫ్రాన్స్ ఫ్రై తెప్పించు. నేను పిలిచినప్పుడు సర్వ్ చేయాలి’ చెప్పాడతను, కమాండ్ నిండిన స్వరంతో.
‘ఎస్ సార్...’ చెప్పి, మరోసారి సెల్యూట్ చేసి బయటకి నడిచాడతను.
లాల్చీ పైజామా వ్యక్తి టవల్ తీసుకుని స్నానాల గదిలోకి ప్రవేశించి పది నిమిషాల్లో స్నానం ముగించుకుని వచ్చాడు. యాభై దాటినా ఇంకా ఉక్కుముక్కలా కనిపిస్తున్నాడంటే శరీరం నిండా పట్టిన కొవ్వు అని తెలిసిపోతుంది. లుంగీ కట్టుకుని బాడీ స్ప్రే ఒళ్లంతా కొట్టుకుని టీపాయ్ ముందు కుర్చీలో కూర్చున్నాడు.
గ్లాసులో విస్కీ పోసుకుని కొద్దిగా షోడా కలిపి నీళ్లతో నింపాడు. ఓ గుక్క తాగి నోరు చప్పరించాడు. అరుదుగా లభ్యమయ్యే మద్యం అది. ఒక పెగ్గు ఎక్కువ తాగినా ఇబ్బంది ఉండదు. డిపార్ట్‌మెంట్ తరఫున వచ్చినప్పుడు చేసే మర్యాదల్లో అదొకటి. ఏదో వంక మీద విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వచ్చేందుకు అధికారులు ఉత్సాహం చూపిస్తారు అందుకే!
నిజానికి ముందుగా అనుకుని అక్కడకి రాలేదతను. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఓ ఇన్‌స్పెక్టర్ కాల్చి చంపడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనం రేగింది. దాని మీద విచారణ జరిపి నివేదిక ఇమ్మని అప్పటికప్పుడు పంపింది ప్రభుత్వం. ఎన్‌కౌంటర్ జరిగిన కొన్ని గంటల్లో అతను విశాఖపట్నం చేరాడు. అదంతా ఓ నాటకమని చాలామందికి తెలియదు.
అతని ఆలోచనలు చెదరగొడుతూ కాలింగ్ బెల్ మోగింది.
‘కమిన్...’ చెప్పాడు.
ఒక యువతి లోపలికి వచ్చింది. వెంటనే అతను లేచి వెళ్లి బయటకు చూశాడు. ఎవరూ లేరు. తలుపుకి బోల్ట్ వేసొచ్చి అన్నాడు,
‘కూర్చో’
అప్పటివరకూ తల మీద కప్పిన చున్నీ తీసేసి జంకుతూ కూర్చుంది. ఆమెకి పాతిక కూడా ఉండదు వయసు.
‘బిగుసుకు పోకు.. ఫ్రీగా ఉండు’ చెప్పాడతను.
‘నీ పేరు?’ అడిగాడు, ఆమె వౌనంగా ఉండటంతో
‘స్వప్న’
‘ఏం చేస్తున్నావ్?’
‘బిటెక్ సెకండ్ ఇయర్’
అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది. చాలాకాలం క్రితం అతని సాయం పొందిన వ్యక్తి చేసిన ఏర్పాటది. ముందే చెప్పాడు. ఆశ్చర్యకరమైన కానుక పంపుతాను అనుభవించమని. స్వప్నని చూశాక అతను చెప్పింది నిజమేనని గ్రహించిన తర్వాత అతని ఉత్సాహం రెట్టింపయింది.
‘మందు తీసుకుంటావా?’ అడిగేడు.
‘అలవాటు లేదండి’ చెప్పిందామె.
‘టెన్షన్‌లో ఉన్నట్టున్నావ్. కొంచెం తీసుకో పోతుంది’ అనునయంగా అన్నాడు.
‘వద్దండి’
‘పర్లేదు. ఇక్కడ నువ్వు, నేను తప్ప ఎవరూ లేరు’ చెప్పి, గ్లాసులో మందు పోసి కూల్‌డ్రింక్ కలిపాడు.
ఇంజనీరింగ్‌లో చేరిన మొదట్లో కొంతమంది సీనియర్లు హాస్టల్‌కి వచ్చి ర్యాగింగ్ చెయ్యడం గుర్తొచ్చిందామెకి. హాఫ్ పెట్ బాటిల్ కూల్‌డ్రింక్ దింపకుండా తాగమన్నారు. ముందు తెలియలేదు కాని తాగడం పూర్తయ్యాక అందులో ఏదో కలిపారని అర్థమైంది. ఆ తర్వాత డాన్సులు చేయించి పాటలు పాడించారు. మగాళ్లు రతి ఎలా చేస్తారో అభినయించిందో అమ్మాయి. ఆ డ్రింక్ తాగి ఉండకపోతే ఆ దరిద్రాన్ని భరించలేకపోయేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.
అతను గ్లాసు అందించాడు.
* * *
పొడవాటి జుట్టు ముడి వేసుకుంటూ గదిలోకి వచ్చాడతను. గడ్డం మీసాలు నున్నగా గీసిన ముఖం గమ్మత్తుగా ఉంది. ఆరడుగులకు కాస్త తక్కువ ఎత్తులో బలిష్టంగా ఉన్నాడు. లంగా లుంగీలా కట్టుకుని టీషర్టుతో వయ్యారంగా నడుస్తూ వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. రెండంగుళాల మందం బంగారు చైను మెడలో వేలాడుతోంది. కాటుక వల్ల కళ్లు పెద్దగా కనిపిస్తున్నాయి.
టేబుల్ మీద రెండు ల్యాండ్ లైన్లు, మూడు సెల్‌ఫోన్లు ఉన్నాయి. గోడ గడియారం వంక చూసి తల పంకించాడతను. సొరుగు లాగి రమ్ బాటిల్, గ్లాసు, వాటర్ బాటిల్ టేబుల్ మీద పెట్టాడు. గ్లాసులో సగం వరకూ రమ్ పోసుకుని మిగిలిన ఖాళీని నీటితో నింపాడు. రిమోట్ అందుకుని టీవీ ఆన్ చెయ్యబోయి వెంటనే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.
గ్లాసు తీసుకుని అందులోని ద్రవాన్ని సగం తాగేడు. గోడ గడియారం మరోసారి చూసి సెల్‌ఫోన్ల మీద దృష్టి నిలిపాడు. అప్పుడు మోగింది మధ్యలోని ఎరుపు సెల్. నెంబర్ చూసి ఆన్సర్ బటన్ నొక్కాడు.
‘చెప్పరా చిన్నోడా..’
‘పార్కు హోటల్‌కి, పోలీస్ గెస్ట్‌హౌస్‌కి మాల్ చేరిపోయింది’
‘ఇనుస్ట్రుమెంట్ ఉపయోగించడం తెలుసుగా వాళ్లకి?’
‘తెలుసు’
‘చిన్నోడా ఇప్పుడెక్కడున్నావ్?’
‘ఇంటికి వెళుతున్నాను’
బిగ్గరగా నవ్వేడతను. మగవాళ్ల గాంభీర్యం, ఆడవాళ్ల సరళత్వం కలగలిసిపోయిన స్వరం చిత్రంగా ధ్వనించింది.
‘కథలు చెప్పకురా చిన్నోడా! ఇప్పుడు నువ్వు ఉమర్‌ఖయ్యూం బార్ దగ్గరున్నావు. నీ స్నేహితులు కూడా అక్కడకు వచ్చారు. వారితో కూర్చుని తాగుతావు. కడుపులోకి కొంచెం మందు వెళితే ఒళ్లు మర్చిపోతావు. ఎంత తాగుతున్నావో ఎందుకు తాగుతున్నావో నీకు తెలియదు. ఇంటికెళ్లేసరికి నిద్రపోతున్న భార్యాపిల్లలు లేచి కూర్చుంటారు. మగాడు ఎన్ని వెధవ పనులు చేసినా కుటుంబం కోసమే. భార్యాపిల్లల్ని కష్టపెట్టినోడు రాణించడురా చిన్నోడా! తాగాలంటే నీ ఇంటి చుట్టుపక్కల ఓ బడ్డీ చూసుకో, తాగి అర్ధరాత్రి రోడ్డు మీద తైతక్కలాడితే ఊరుకోను..’ చెప్పి కట్ చేశాడు.
అతని పేరు గంగోత్రి.
చాలా తక్కువమందికి తెలుసు ఆ పేరు. ఎందుకంటే, అతను చేసే ప్రతీ పని బాస్ పేరుతో జరుగుతుంది. ఆ బాస్ ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో ఒక్క గంగోత్రికి తప్ప ఎవరికీ తెలియదు. బాస్ నుచి వచ్చిన ఆదేశాలు అమలు చేస్తాడు గంగోత్రి. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగల సమర్థుడతను.
తల్లిదంత్రులే కాదు వాళ్లు పెట్టిన పేరు కూడా తెలియదతనికి. ఒకనాడు రోడ్డుపక్క ఏడుస్తుంటే ఎవరో చేరదీశారు. ఆ తర్వాత చిత్రమైన అతని ... చూసి వెళ్లగొట్టారు. అలా ప్రారంభమయిన జీవితం విశాఖపట్నం రైల్వేస్టేషన్ వెనుక పిచ్చిమొక్కల మధ్య గుడారాల్లో తలదాచుకునే హిజ్రాల చెంతకు చేరింది. తమ జాతివాడేనని అక్కున చేర్చుకుని గంగోత్రి అని పిలవడం మొదలెట్టారు. వాళ్ల మధ్య పెరిగినప్పుడే మగవాడి బలహీనత, ఆడవారి బలం అర్థం చేసుకున్నాడు.
భూపతి వంటి బలవంతుని అండతో ఓ చిన్నసైజు సామ్రాజ్యాన్ని నిర్మించుకొన్నాడు గంగోత్రి. అతని దగ్గర తాజా సరకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ సరకు సంపాదించడానికి నిత్యం కొందరు యువకులు పని చేస్తూ ఉంటారు. అమ్మాయిల్ని పరిచయం చేసుకోవడం దగ్గర నుంచి అంతా ఓ పథకం ప్రకారం జరుగుతుంది. పిట్ట వలలో చిక్కాక మిగతా వ్యవహారం గంగోత్రి చూసుకుంటాడు.
గంగోత్రి గ్లాసులో మిగిలిన రమ్ తాగి రిమోట్ అందుకున్నాడు.
టీవీ తెర మీద బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. గదిలో ఇద్దరు యువతులు నగ్నంగా ఉన్నారు.
పెదాలు కొరుక్కున్నాడు గంగోత్రి.
అతని శరీరంలో పూర్తిగా పెరగని స్ర్తి పురుష అవయవాలు రెండూ ఉన్నాయి. ఎవరు చూసినా అసహ్యించుకుంటారు. తనని అలా సృష్టించిన దేవుడంటే చాలా కోపం అతనికి. అందుకే ఆ రెండు అవయవాలతో వ్యాపారం చేస్తున్నాడు. ఎప్పుడైనా, ఎవరైనా తోక జాడిస్తే వారి చీకటి జీవితం వెలుగు చూస్తుంది. ఆ భయంతోనే ఎవరూ అతని జోలికి రారు.
ఒక్కడు తప్ప!

(మిగతా వచ్చే సంచికలో)

-మంజరి 9441571994