జాతీయ వార్తలు

మితిమీరిన పెద్దరికం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెన్సార్ బోర్డు చీఫ్‌పై సినీ ప్రముఖుల ధ్వజం

ముంబయి, నవంబర్ 23: ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న జేమ్స్‌బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ విషయమై సినీ వర్గాలకు, సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లజ్ నిహ్లానీకి మధ్య వివాదం రాజుకుంటోంది. ఈ చిత్రంలో 30 సెకన్ల పాటు సుదీర్ఘంగా సాగే చుంబన దృశ్యం నిడివిని కేవలం 8 సెకన్లకు కుదించి ఏకపక్షంగా వ్యవహరించినందుకు ఇంటా బయటా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న నిహ్లానీపై ఇటు సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు అటు బాలీవుడ్ ప్రముఖులు నిప్పులు చెరుగుతున్నారు. ‘అతి నియంత్రణలను మానుకోవాలి’ అనే సందేశాలతో పలువురు సినీ ప్రముఖులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. భావ ప్రకటనను అడ్డుకోడం తప్ప మరో పనేమీ లేని సెన్సార్ బోర్డును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, బలవంతంగా రుద్దుతున్న సెన్సార్‌షిప్‌ను తక్షణమే రద్దు చేయాలని ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగళ్ గోవాలో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) సందర్భంగా అన్నారు. ఎన్‌డిఎఫ్‌సి ఫిలిం బజార్‌కు హాజరయ్యేందుకు గోవాలోనే ఉన్న ‘బజరంగీ బైజాన్’ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ కూడా సెన్సార్ బోర్డుపై ధ్వజమెత్తారు.
సెన్సార్‌షిప్ వివాదం ‘స్పెక్టర్’ చిత్రంలోని చుంబన దృశ్యాల చుట్టూ తిరగడం హాస్యాస్పదని ఆయన అన్నారు. ‘చుంబన దృశ్యాన్ని చూడకూడదని పెద్దలుగా మనం చెప్పగలమా? 30 సెకన్ల నిడివి ఉన్న చుంబన దృశ్యాన్ని 8 సెకన్లకు ఎందుకు కుదించాలి? ఆ మిగిలిన 22 సెకన్ల దృశ్యం కూడా ఉంటే మన నైతిక విలువలు, దేశ సంస్కృతి నాశనమవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా కూడా ఇదేవిధంగా స్పందించారు.
అంతర్జాతీయ చిత్రాలకు మన దేశంలో ఇంతకుముందు ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఎదురు కాలేదని, అతి నియంత్రణలు పాటిస్తున్న వారెవరైనా గతంలో వచ్చిన చిత్రాలను ఒకసారి పరిశీలించాలని ఆమె అన్నారు.